అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:34 PM
నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.
- ఎమ్మెల్యే విజయుడు
- అభివృద్ధి పనులకు భూమిపూజ
అలంపూర్, డిసెంబరు 26 : నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని క్యాతూరు గ్రామంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నిధులు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మండల మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం వాల్మీకీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
మాజీ సర్పంచుకు పరామర్శ
ఇటిక్యాల : మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచు వావిలాల రంగారెడ్డిని మంగళవారం అలంపూరు ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. రంగారెడ్డి గుండె సంబంధిత వ్యాధికి గురై, ఈ నెల 22న హైదరాబాద్‌లో చికిత్స చేయించుకొని వచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు కర్నూలుకు వెళ్లి రంగారెడ్డిని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్, రఘురెడ్డి తదితరులున్నారు.
భక్తి శ్రద్ధలతో లింగమయ్య విగ్రహ ప్రతిష్ఠ
అలంపూర్ : మండలంలోని క్యాతూరులో మంగళవారం లింగమయ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు గుడి నిర్మాణ దాత డాక్టర్ గోవర్ధన్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు.
Updated Date - Dec 26 , 2023 | 10:34 PM