విజేత పాలమూరు
ABN, First Publish Date - 2023-12-10T22:53:49+05:30
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17.. 67వ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది.
రాష్ట్ర స్థాయి బాలుర అండర్ 17 ఫుట్‌బాట్ టోర్నమెంట్‌లో గెలుపు
బాలికల విభాగంలో రంగారెడ్డి..
జడ్చర్ల, డిసెంబరు 10: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17.. 67వ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. మూడు రోజులుగా జడ్చర్ల మునిసిపాలిటీలోని బాదేపల్లి బాలుర జడ్పీహెచ్‌ఎ్‌సలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. బాలురు, బాలికల విభాగంలో నిర్వహించిన ఈ టోర్నీలో ఒక్కో జిల్లా జట్టు నుంచి 20 మంది బాలురు, 20 మంది బాలికలు తలపడ్డారు. బాలుర విభాగంలో లీగ్ మ్యాచ్‌లలో విజయం సాధించిన మహబూబ్‌నగర్, హైదరాబాద్ జట్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. హైదరాబాద్‌పై మహబూబ్‌నగర్ విజేతగా నిలిచింది. రన్నర్‌గా హైదరాబాద్ జట్టు, తృతీయ స్థానంలో నల్గొండ జట్టు నిలిచాయి. బాలికల విభాగంలో ఫైనల్స్‌లో రంగారెడ్డి, నిజామాబాద్ జట్లు తలపడ్డాయి. రంగారెడ్డి విజయం సాధించగా, నిజామాబాద్ జట్టు రన్నర్‌గా, ఖమ్మం తృతీయ స్థానంలో నిలిచింది. విజేతలకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ట్రోఫీలను అందచేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు, మోయిన్, కిట్టు, విలియమ్, కౌన్సిలర్ రఘురాంగౌడ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-12-10T22:53:50+05:30 IST