ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిండుకుండను తలపిస్తున్న కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు

ABN, Publish Date - Dec 21 , 2023 | 11:06 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నిండు కుండలా నీటితో కళకళలాడుతున్నది.

నిండుకుండలా కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు

- వచ్చే నెల ఆరు నుంచి నీటి విడుదల

దేవరకద్ర, డిసెంబరు 21: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నిండు కుండలా నీటితో కళకళలాడుతున్నది. వానాకాలంలో కురిసిన వర్షాలతో పాటు జూరాల నుంచి నీటిని విడుదల చేయడంతో జలకళ సంతరించుకుని 32 అడుగులకు చేరింది. దీంతో అధికారులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ అందరు కలిసి ఆయకట్టు దారులకు నీటిని విడుదల చేయాలని సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు అధికారులు నీటి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్‌ గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి ప్రాజెక్టు కింద రైతులు సాగు చేసుకున్న పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని 10 రోజులకు ఒకసారి ఐదు విడతలుగా నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.

Updated Date - Dec 21 , 2023 | 11:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising