సబ్బండవర్గాలకు సమన్యాయమే లక్ష్యం
ABN, Publish Date - Dec 17 , 2023 | 10:42 PM
రాష్ట్రంలోని సబ్బండ వర్గా లకు సమన్యాయం చేయడమే సీఎం ఎనుముల రేవం త్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, డిసెంబరు 17 : రాష్ట్రంలోని సబ్బండ వర్గా లకు సమన్యాయం చేయడమే సీఎం ఎనుముల రేవం త్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావు లే కుండా అర్హులకు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. క ల్వకుర్తి పట్టణంలోని టీఎస్‌యూటీఎఫ్ భవన్‌లో ఆది వారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి ఎ మ్మెల్యేగా గెలుపొందిన కశిరెడ్డిని పూల మాలలు, శాలు వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజా సమ స్యల పరిష్కారానికి పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిం చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ని యోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలను నెల కొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఉద్యోగులు, కార్మికు ల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలా జీసింగ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, ప్రజా సం ఘాల నాయకులు ఏపీ మల్ల య్య, పి.పరుశరాములు, నరసిం హ, చెన్నయ్య, పలువురు కౌన్సిల ర్లు, నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యేకు వినతి
కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డికి వివిధ స్కీముల్లో పని చేస్తున్న వర్కర్లు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాల ని వినతి పత్రం అందజేశారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు నెలకు 18వేలకు పెంచాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు 10వేల వేతనం ఇస్తామన్న హామీ అమలుపర్చాలని గ్రా మపంచాయతీ, మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, సీఐటీయూ అనుబంధ సంఘాల నాయకులు శ్రీనివాసులు, మాసమ్మ, బక్కయ్య, రజియాసుల్తానా తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యేకు జ్ఞాపిక అందజేసిన నాయకులు
కల్వకుర్తి పట్టణానికి చెందిన సుధాకర్ కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డికి తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని ఆదివారం బహూకరిం చారు. ఎమ్మెల్యేగా కశిరెడ్డి గెలిస్తే తిరుపతిలో మొక్కు తీర్చుకుని ఎమ్మెల్యేకు ప్రసాదం, వేంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని అందజేసినట్లు సుధాకర్ తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 10:42 PM