ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:28 PM

వ్యవస్ధీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేసులపై పారదర్శకంగా విచారణ చేపట్టి నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచాలని ఎస్పీ రితిరాజ్‌ అధికారులను ఆదేశించారు.

నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రితిరాజ్‌

- నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచాలి

- నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రితిరాజ్‌

గద్వాల క్రైం, డిసెంబరు 18 : వ్యవస్ధీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేసులపై పారదర్శకంగా విచారణ చేపట్టి నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచాలని ఎస్పీ రితిరాజ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం సర్కిళ్ల వారీగా పోలీస్‌ అధికారులతో నెలవారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలు పూర్తయినందున పోలీస్‌ అధికారులు వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. నమోదైన ప్రతీ కేసుపై వేగవంతంగా విచారణ చేపట్టాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌ల వారీగా గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌ కేసుల వివరాలను యువీ (అండర్‌ ఇన్విస్టిగేషన్‌) పరిశీలించి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల వివరాలను పరిశీలించి, శిక్షల శాతాన్ని పెంచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆఽధికారులను ఆదేశించారు. కోర్టు ట్రయల్స్‌ నడిచే సమయంలో సాక్షులకు పకడ్బందీగా బ్రీఫ్‌ చేస్తూ నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. గత నెలలో కొన్ని కేసులలో నిందితులకు శిక్షలు పడగా, సంబంధిత ఎస్‌ఐలు, కోర్టు డ్యూటీ అఽధికారులను ఆమె అభినందించారు. దొంగతనాల కేసులను ఛేదించడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాలని ఆదేశించారు. నిందితులను లోతుగా విచారించాలని, వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించాలని చెప్పారు. అందుకు సీసీ కెమెరాలను పరిశీలించాలని, పని చేయని వాటికి మరమ్మతులు చేయించాలని సూచించారు. ఈ నెలలో నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌లో రాజీ పడేందుకు అవకాశమున్న కేసులను గుర్తించాలని ఆధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల పరిష్కారానికి కృషి

శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పోలీస్‌ శాఖ పూర్తి స్ధాయిలో కృషి చేస్తోందని ఎస్పీ రితిరాజ్‌ అన్నారు. గద్వాల పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాల యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 12 ఫిర్యాదులు వచ్చాయని ఆమె తెలిపారు. బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. సమ స్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Dec 18 , 2023 | 10:28 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising