జిల్లా వ్యాప్తంగా ‘ప్రజాపాలన’
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:33 PM
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఐదు గ్యారెంటీ పథకాల కోసం గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైంది.
- తొలి రోజు 11,109 దరఖాస్తులు
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాసులు
గద్వాల/ గద్వాల టౌన్/ కేటీదొడ్డి/ మానవపాడు/ ఇటి క్యాల, డిసెంబరు 28 : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఐదు గ్యారెంటీ పథకాల కోసం గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజల నుంచి 11,109 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ అపూ ర్వ చౌహాన్ తెలిపారు. గ్రామపంచాయతీల్లో 6,701, మునిసిపా లిటీల నుంచి 4,408 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ అన్నారు. గద్వాల పట్టణ పరిధిలోని నదీ అగ్రహారం, రెండవ వార్డు, బీరెల్లి రోడ్డు కాలనీ, కేటీదొడ్డి మండలంలోని మైలగడ్డ, రంగాపురం, గువ్వలదిన్నె, పూజారి తండాల్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. గువ్వలదిన్నెలో బుధవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకుడు ఒకరు పంచాయతీ కార్యదర్శి నుంచి దరఖాస్తు ఫారాలను బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలుసుకున్న ఆయన అధికారులతో మాట్లాడారు. ఎస్‌ఐ వెంకటేశ్ సదరు కాంగ్రెస్ నాయకుడి ఇంటికి వెళ్లి దరఖాస్తులను స్వాధీనం చేసుకు న్నారు. ఆయా కార్యక్రమాల్లో గద్వాల మునిసిపల్ కమిషనర్ కె.నర్సింహ, కేటీదొడ్డి తహసీల్దార్ సరితా రాణి, శివశంకర్, ఉదయ్‌కుమార్ ఉన్నారు.
అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. మానవపాడు మండలంలోని గోకులపాడు, చంద్రశేఖర్‌నగర్, ఇటిక్యాల మండలంలోని గోపలదిన్నె, మొగలిరావుల చెర్వు గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. గోకులపాడులో 166, చంద్రశేఖర్ నగర్ గ్రామంలో 90 ఽమంది దరఖాస్తు చేసుకున్నారు. గోపలదిన్నెలో 172, మొగలిరావులచెర్వులో 142 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ వెంకటేశ్వరు,్ల ఎంపీవో భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో మానవపాడు ప్రత్యేక అధికారి సిద్ధయ్య, ఎంపీడీవో రమణారావు, ఏవో సుబ్బరెడ్డి, సూపరింటెండెంట్ అజిత్‌కుమార్, ఆర్‌ఐ భీంసేన్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 11:33 PM