‘ప్రజా పాలన’ను పకడ్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:48 PM
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టనున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహిం చాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
- అర్హులైన ప్రతీ ఒక్కరి నుంచి దరఖాస్తు స్వీకరించాలి
- కార్యక్రమానికి ఒక రోజు ముందు దండోరా వేయించాలి
- అదనపు కలెక్టర్ కుమార్ దీపక్
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెంబరు 26: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టనున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహిం చాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరే ట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ అధి కారులు, డీఎల్‌పీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీ వోలు, తహసీల్దార్లు, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయ తీరాజ్ శాఖల అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రజా పాలన కార్యక్రమంపై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వ హించనున్న ప్రజా పాలన కార్యక్రమాల అమలుకు క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉండా లని ఆదేశించారు. ప్రతి గ్రామ, వార్డులో గ్రామ సభలు సజావుగా నిర్వహించాలన్నారు. ప్రజా పాలనలో అలస త్వం వహించవద్దని, అర్హులైన ప్రతీ ఒక్కరి నుంచి దర ఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. నియోజకవర్గం, మండల, గ్రామస్ధాయిలో ప్రత్యేక అధికారుల బృందాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. పంచా యతీ స్థాయిలో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామసభలో ఏర్పాటు చేసిన ప్రతి కౌంట ర్‌కు ప్రజాపాలన బోర్డు ఉండాలని సూచించారు. జిల్లా లోని అర్హులైన అబ్ధిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించ డం కోసం ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రామ సభ లు సజావుగా జరగాలని, ఆయా అధికారులు, బృందా లు ఎలాంటి అలసత్వం వహించవద్దన్నారు. దరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్వీకరిం చాలన్నారు. సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్రజాపా లన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో 461 గ్రామ పంచాయతీలతో పాటు నాలుగు మునిసిపాలిటీల్లోని 86 వార్డుల్లో మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, రైతు బరోసా తదితర ప థకాల దరఖాస్తులు స్వీకరించాలని పేర్కొన్నారు. నిర్దేశిం చిన తేదీల్లో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖా స్తులు స్వీకరించాలన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన కు ర్చీలు, టెంట్లు, తాగునీరు, మహిళలకు, పురుషులకు వే ర్వేరుగా క్యూలైన్లు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆ దేశించారు. ప్రజా పాలన కార్యక్రమానికి ఒకరోజు ముం దు గ్రామాలు, వార్డుల్లో దండోరా వేయించాలన్నారు. ప్ర తి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి, వారికి తగిన సూచ నలు, సలహాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, డీఆర్‌డీ వో నర్సింగరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 10:48 PM