దేశ సమైక్యత, అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:35 PM
దేశం అన్ని రంగా ల్లో సమగ్ర అభివృద్ధిని సాధించడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, జడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు
- జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత
- ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
గద్వాల టౌన్, డిసెంబరు 28 : దేశం అన్ని రంగా ల్లో సమగ్ర అభివృద్ధిని సాధించడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, జడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్‌లో పార్టీ జెండాను ఆమె ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి అండగా ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. స్థానిక సంస్థల ఏర్పాటుతో ప్రజలను పాలనలో భాగస్యాములను చేసిన కాంగ్రెస్ పార్టీ, ప్రణాళికా బద్ధంగా అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. సాగు నీటి ప్రాజెక్టులతో పాటు యువతకు ఉపాధి లభిం చేలా పబ్లిక్ రంగ సంస్థలు, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు వరకు జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకుని డాక్టర్ మన్‌మోహన్‌సింగ్ వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధానులు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని ప్రారంభించిన ప్రభుత్వం, మొత్తం ఆరు వాగ్దానాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలి పారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు శంకర్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లత్తీపురం వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వాకిటి సంజీవులు, నాయకులు మధుసూదన్‌బాబు, మోహన్‌రావు, రామలింగేశ్వర కామ్లే, ఎల్లప్ప, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మణ్, నాగశంకర్, ఆనంద్, టీఎన్‌ఆర్ జగదీష్, షేక్‌జమాల్, షాషా, కొత్తగణేష్, ఖిఫాయత్, కౌసర్‌బేగ్, అప్సర్, పరమేష్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే సుస్థిర పాలన
వడ్డేపల్లి : కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర పాలన సాధ్యమని రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ వడ్డేపల్లి దేవేం ద్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం శాంతినగర్‌లోని పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నాగశిరోమణి, కిసాన్‌సెల్ అధ్యక్షుడు నాగరాజు, పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, వెంకట్రామన్, కోఆప్షన్ మెంబర్ మైనొద్దీన్, వడ్డేపల్లి జగన్, కరుణా కర్ రెడ్డి, తోట హనుమంతు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 11:35 PM