ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మైసమ్మకు మంత్రి పూజలు

ABN, First Publish Date - 2023-12-10T22:52:08+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి శివారులో వెలసిన మైసమ్మ దేవతకు రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి జూపల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

మైసమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా 8 పర్యాటకంగా మారుస్తా

ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

పెద్దకొత్తపల్లి, డిసెంబరు 10: నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి శివారులో వెలసిన మైసమ్మ దేవతకు రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి జూపల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయినోనిపల్లి మైసమ్మ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. మైసమ్మ తల్లి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తానన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. అనంతరం మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సూర్యప్రతా్‌పగౌడ్‌, జడ్పీటీసీ సభ్యురాలు మేకల గౌరమ్మ, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు, సర్పంచ్‌ ఆదెర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, పెద్దిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దండు నరసింహ, ఈవో రంగారావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మేకల చంద్రయ్య యాదవ్‌, మల్లేష్‌ యాదవ్‌, ఎండీ సలీం పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T22:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising