ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జనజాతర

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:32 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించడంతో ప్రజలు పెద్దఎత్తున కేంద్రాలకు చేరుకున్నారు.

షాసాబ్‌గుట్ట కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవినాయక్‌

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 28: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించడంతో ప్రజలు పెద్దఎత్తున కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో కేంద్రాల వద్ద జనజాతర కనిపించింది. ఏ కేంద్రంలో చూసినా వందల్లో జనాలు బారు లు తీరారు. జిల్లా కేంద్రంలోని పురపాలిక పరిధిలో మొదటి రోజు ఎనిమిది వార్డులలో దరఖాస్తులను స్వీకరించారు. ఉదయం అన్ని కేంద్రాలకు అధికారులు చేరుకొని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సందేశం చదివి వినిపించారు. ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికలో ఇచ్చిన హామీ మేర కు చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకా లు అందినపుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుం దని, అదే ప్రజాపాలన లక్ష్యమన్న సందేశం ప్రజలకు వినిపించారు. అనంతరం దరఖాస్తు ఫారాలు అందజేశా రు. అయితే అన్ని కేంద్రాలకు జనం పోటెత్త డంతో ముందుగా తీసుకువచ్చిన దరఖాస్తులు గంట వ్యవధి లోనే అయిపోయాయి. దీంతో చాలామంది దరఖాస్తు ఫారాలు లేక అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. గంట తరువాత మళ్లీ దరఖాస్తు ఫారాలు రావడంతో వాటిని పంపిణీ చేశారు. ప్రజలు తీసుకున్న దరఖాస్తుల లో నాలుగోవంతు కూడా అధికారుల వద్దకు తిరిగి రాక పోవడంతో కేంద్రాల వద్దనే అధికారులు సిబ్బందిని కూర్చో బెట్టి వారే దరఖాస్తు ఫారాలను నింపి తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో కేంద్రంలో 10-14 టేబుళ్లను ఏర్పాటుచేసి దరఖాస్తులు స్వీకరించారు. కేంద్రాలను కలెక్టర్‌ జి రవినాయక్‌, అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, ఆర్డీవో అనిల్‌కుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ పరిశీలించారు. షాషాబ్‌గుట్ట కేంద్రం వద్ద కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందాలని సూచించారు. తొలిరోజు పట్టణంలోని ఎనిమిది వార్డులలో 3,133 ధరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 11:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising