ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంటి కరెంటు బిల్లు రూ. 83,760

ABN, First Publish Date - 2023-11-10T22:35:05+05:30

నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలోని ఓ ఇంటికి కరెంటు బిల్లు ఏకంగా రూ. 83,760 రావడంతో ఆ ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. వగ్గు చైతన్య తమ ఇంటికి సాధారణంగా వచ్చే రూ. 68 కరెంటు బిల్లు నెలనెలా ఆన్‌లైన్‌లో చెల్లిస్తుండేవాడు.

కోడేరు, నవంబరు 10 : నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలోని ఓ ఇంటికి కరెంటు బిల్లు ఏకంగా రూ. 83,760 రావడంతో ఆ ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. వగ్గు చైతన్య తమ ఇంటికి సాధారణంగా వచ్చే రూ. 68 కరెంటు బిల్లు నెలనెలా ఆన్‌లైన్‌లో చెల్లిస్తుండేవాడు. ఈ నెల కరెంటు బిల్లు రూ. 83,760 ఈ నెల 18వ తేదీలోపు చెల్లించాలని 4న విద్యుత్‌ సిబ్బంది బిల్లు ఇచ్చారు. దీంతో ఆందోళనలో పడ్డ ఇంటి యజమాని విద్యుత్‌ అధికారులను ఫోన్‌లో సంప్రదించాడు. అధికారులు చూస్తాం, బిల్లు జంపు అయి ఉంటుందని, సరి చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమా, ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ తప్పిదమా అని చైతన్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-10T22:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising