వైభవంగా హనుమాన్ రథోత్సవం
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:39 PM
మండల కేంద్రంలోని బయటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పౌర్ణమి సందర్భంగా రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
నర్వలో రథాన్ని లాగుతున్న భక్తులు
నర్వ, డిసెంబరు 26 : మండల కేంద్రంలోని బయటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పౌర్ణమి సందర్భంగా రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్ల తిమ్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల ఆనందోత్సవాల మధ్య సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
Updated Date - Dec 26 , 2023 | 10:39 PM