ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి

ABN, Publish Date - Dec 29 , 2023 | 10:59 PM

అభయహస్తం పథకంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రకటించిన గ్యారెంటీ పథకాల కోసం అర్హులైన ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నా రు.

మార్లబీడులో నిర్వహించిన ప్రజాపాలన సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- రెండవ రోజు కొనసాగిన ‘ప్రజాపాలన’

ధరూరు, డిసెంబరు 29 : అభయహస్తం పథకంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రకటించిన గ్యారెంటీ పథకాల కోసం అర్హులైన ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నా రు. ధరూరు మండల పరిధిలోని మార్లబీడు గ్రామం లోని రైతువేదిక ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆమె పాల్గొని, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం ఒకే దరఖాస్తును ఖరారు చేసింద న్నారు. ఏమైనా సందేహాలు ఉంటే అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కాంతమ్మ, స్పెషల్‌ ఆఫీసర్‌ రమేష్‌, ఎంపీడీవో జబ్బార్‌, నాయకులు, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బండ్ల లక్ష్మీదేవి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీపీ నజుమున్సీసా బేగం, ఎంపీటీసీ సభ్యురాలు ఎల్లమ్మ, గాళ్ల సురేష్‌, జి.రాము, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రోషన్న, శివరాజ్‌, నరసింహ, శ్రీకాంత్‌ రెడ్డి, బోయ శ్రీను, రాము, కుర్వ శ్రీనివాసులు పాల్గొన్నారు.

పేదలకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

కేటీదొడ్డి : కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకా లు అందించేందుకు కృషి చేస్తోందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. కేటీదొడ్డి మండలంలోని గంగన్‌పల్లి, ఇర్కిచేడు గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆమె పాల్గొని, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్ర మంలో ఎంపీడీవో మహ్మద్‌ అజార్‌మొహీద్దిన్‌, తహసీ ల్దార్‌ సరితారాణి, ఎంపీవో సయ్యద్‌ ఖాన్‌, సర్పంచు మాధవికులకర్ణి పాల్గొన్నారు.

అర్హ్హులందరికీ పథకాలు అందాలి

గట్టు : అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని జడ్పీటీసీ బాసు శ్యామల అన్నారు. మండల పరిధిలోని వాయిలకుంట తండా, ఆలూరు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్య క్రమానికి ఆమె హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సుబ్ర హ్మణ్యం, తహసీల్దార్‌ ధనుంజయ, ఎంపీవో రాం ప్రసాద్‌, సర్పంచులు కుర్వ మల్లమ్మ, కృష్ణవేణి, ఎంపీటీసీ సభ్యుడు ఆనంద్‌గౌడ పాల్గొన్నారు.

వడ్డేపల్లి : మునిసిపాలిటీ పరిధిలోని మూడు, నాల్గవ వార్డులకు సంబంధించి సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణసూరి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ లక్ష్మారెడ్డి, మూడవ వార్డు కౌన్సిలర్‌ ఆంజనేయులు, మేనేజర్‌ అబ్దుల్‌ సలాం బాషా, తోట హనుమంతు పాల్గొన్నారు.

ఇటిక్యాల : ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతీ ఒక్క రూ దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని శివనంపల్లి, శనగపల్లి గ్రామాల్లో రెండవ రోజు శుక్రవారం ప్రజాపాలనలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. శనగపల్లిలో 122, శివనంపల్లిలో 113 దరఖాస్తులు వచ్చాయని ఎంపీవో భాస్కర్‌ యాదవ్‌, తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రూపారాణి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

ఉండవల్లి : ప్రజల సందేహాలను నివృత్తి చేసేందు కు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి అన్నారు. ఉండవల్లి మండలంలోని మారమునగాల ఒకటి, రెండు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మార మునగాల ఒకటిలో 208, మారమునగాల రెండులో 285 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. శని వారం ఇటిక్యాలపాడు, కంచుపాడు గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

‘ప్రజాపాలన’ను సద్వినియోగం చేసుకోవాలి

మల్దకల్‌ : అర్హులైన వారందరూ ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ తిమ్మారెడ్డి అన్నారు. మండలంలోని నేతువాని పల్లి, అడవిరావులచెర్వు గ్రామాల్లో శుక్రవారం నిర్వి హంచిన గ్రామసభలకు ఆయన హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మానవపాడు : సంక్షేమ పథకాలను సద్విని యోగం చేసుకోవాలని ప్రత్యేకాధికారి నాగేంద్రం అన్నా రు. మండలంలోని నారాయణపురం, పెద్ద ఆముదాల పాడు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిచారు. నారాయణపురంలో 210, పెద్ద ఆముదాలపాడులో 174 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణరావు, ఏవో సుబ్బరెడ్డి, రెవెన్యూ అధికారులు, సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

రాజోలి : రాజోలి మండలంలోని ముండ్లదిన్నె, పెద్ద ధన్వాడ గ్రామాల్లో శుక్రవారం ఎంపీడీవో గోవింద్‌రావు ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ముండ్లదిన్నెలో255, పెద్ద ధన్వాడలో 625 ధరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు. శనివారం మండలంలోని చిన్న ధన్వాడ, తుమ్మిళ్ల గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అయిజ : ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అయిజ మండల పరిధిలోని నౌరోజి క్యాంపు, ఉప్పల క్యాంపు, యాపదిన్నె గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరించినట్లు ఎంపీడీవో సాయిప్రకాష్‌ తెలిపారు.

Updated Date - Dec 29 , 2023 | 10:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising