బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి
ABN, Publish Date - Dec 23 , 2023 | 11:06 PM
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ కోరారు.
ఎస్పీ యోగేష్ గౌతమ్
నారాయణపేట, డిసెంబరు 23 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం 2024 జనవరి 1 నుంచి 31వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్ -10 నిర్వహాణ నోడల్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్, చైల్డ్‌లైన్, బాల రక్షా భవన్, సఖీ తదితర అధికారులు, ఆపరేషన్ స్మైల్ టీఎంకు నియమించ బడ్డ సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. 18 ఏళ్లలోపు బాల కార్మికులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించాలన్నారు. లేదా స్టేట్ హోంకు పంపించాలని, పాఠశాలలో చేర్పించాలని సూచించారు. తల్లిదండ్రులు తాత్కాలిక ప్రయోజనాల కోసం పిల్లలను బడి మాన్పించి పనులకు పంపిస్తే అది నేరంగా గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఆపరేషన్ స్మైల్ 10 బృందంలో ఒక ఎస్‌ఐ, నల్గురు సిబ్బందిని నియమించామని వీరితో పాటు ఆయా శాఖల అధికారులు దాడులు నిర్వహిస్తారన్నారు. అంతకుముందు డీఎస్పీ సత్యనారాయణ ఆయా శాఖల అధికారులు, బృందం సభ్యులతో సమావేశమై ఆపరేషన్ స్మైల్ గురించి ప్రత్యేక సూచనలు చేశారు. వీధి బాలలు కన్పించినప్పుడు డయల్ 100కు, 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐ రవిబాబు, కార్మిక శాఖ రాజ్‌కుమార్, ఆర్డీవో ఏవో తిరుపతయ్య, సీడబ్ల్యూసీ రాధమ్మ, యాదయ్య, కమలమ్మ, ఆపరేషన్ స్మైల్ టీం ఎస్‌ఐ బద్రీనాథ్, డీసీఆర్బీ ఎస్‌ఐ సునిత పాల్గొన్నారు.
ముస్లింలకు బ్లాంకెట్స్ అందించిన ఎస్పీ..
మూమెంట్ ఫర్ పీస్ జస్టీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేటలోని ముస్లింలకు ఎస్పీ యోగేష్ గౌతమ్ బ్లాంకెట్స్ పంపిణీ చేసి, మాట్లాడారు. ఎంపీజే సంస్థ చేస్తున్న సేవలను ఆయన అభినందిస్తూ ప్రతీ ఒక్కరు సేవాగుణం కలిగా ఉండాలని, సాధ్యమైనంతగా సమాజ సేవ చేయాలన్నారు. అనంతరం నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రవి, ఎంపీజే అధ్యక్షుడు అజీమ్ హుస్సెన్, మహమ్మద్ ఫైజల్, మహమ్మద్ సిద్దికి, సయ్యద్ అక్మాల్, న్యాయవాదులు అమిరుద్దిన్, సలీం పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 11:06 PM