ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విధులు సక్రమంగా నిర్వర్తించాలి

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:31 PM

అంగన్‌వాడీ కార్యకర్తలు సక్రమంగా విధులకు హజరు కావా లని సీడీపీవో కమలాదేవి ఆదేశించారు.

మల్దకల్‌ అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న సీడీపీవో

- సీడీపీవో కమలాదేవి

- పలు అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ

మల్దకల్‌, డిసెంబరు 18 : అంగన్‌వాడీ కార్యకర్తలు సక్రమంగా విధులకు హజరు కావా లని సీడీపీవో కమలాదేవి ఆదేశించారు. మండ లంలోని మేకలసోంపల్లి 1,2, పాల్వాయి, మల్ద కల్‌-1 అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. పిల్లల హాజరు, మెనూ అమలు, స్టాక్‌, ప్రీస్కూల్‌ కార్యక్రమాల నిర్వహణపై అంగన్‌వాడీ టీచర్లతో చర్చించారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రంలోనే వండిన ఆహారాన్ని భుజించాలని, ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు మాత్రమే బాలామృతం, 16 గుడ్లు ఇస్తారని తెలిపారు. ప్రతీ రోజు ఉదయం తొమ్మిది నుంచి సాయం త్రం నాలుగు గంటల వరకు కేంద్రాలను నిర్వ హించాలని ఆదేశించారు. కేంద్రంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పోషణ లోపంతో బాధపడే చిన్నాలను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట పోషణ్‌ అభియాన్‌ జిల్లా అధికారి రఘునాథరెడ్డి ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising