ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేపటి నుంచి ప్రజాపాలన

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:06 PM

రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలుతో పాటు, ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు చేపట్టే ప్రజా పాలన సదస్సులు గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.

మాట్లాడుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌

- నేడు ఇన్‌చార్జిమంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష

- ఆరుగ్యారెంటీలు, ఇతర పథకాలు, సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ

- విజయవంతం చేసేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలుతో పాటు, ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు చేపట్టే ప్రజా పాలన సదస్సులు గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతీ నాలుగు నెలలకోసారి ఈ సదస్సులు నిర్వ హించ తలపెట్టిన ప్రభుత్వం తొలివిడతగా రేపటి నుంచి శ్రీకారం చుడుతోంది. క్షేత్రస్థాయిలో జవాబు దారీతనంతో పాటు, ప్రజాభిప్రాయానికి ప్రత్యేకించి నిరుపేద, అణగారినవర్గాల అభిప్రాయాల కనుగు ణంగా మెరుగైన పాలన అందించేందుకు ఉద్దేశించి న ఈ కార్యక్రమంలో ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారుల ఎంపిక, వివిధ పథకాలకు, రేషన్‌కార్డుల కు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి దర ఖాస్తులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.

ప్రతీ గ్రామం/మునిసిపల్‌ వార్డులో..

ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిపే ఈసదస్సుల నిర్వహణకు మండల/ మునిసిప ల్‌ అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. మండల బృందంలో తహసీల్దార్‌/రెవెన్యూ ప్రతినిధి, ఎంపీడీవో/గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతినిధి, ఎంపీవో, వ్యవసాయాధికారి, పౌరసరఫరాలశాఖాధికారి, మండ ల వైద్యాధికారి, ఎంఈవో, ఏఈ (డిస్కం), పంచా యతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్లు, ఇతర ప్రభుత్వ సంబంధిత అధికారులు ఈ బృందంలో పాల్గొంటారు. మునిసిపాలిటీలకు సంబంధించి మునిసిపల్‌ కమిష నర్‌/ పురపాలకశాఖ ప్రతినిధితో పాటు రెవెన్యూ శాఖ, ఇతర అన్నిశాఖల అధికారులు పాల్గొంటారు. ఈ సదస్సుల నిర్వహణకు ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. మండ ల కమిటీల సభ్యులకు మంగళవారమే అదనపు కలెక్టర్‌ (స్థానికసంస్థలు) శివేంద్ర ప్రతాప్‌ ఆధ్వర్యం లో శిక్షణ ఇప్పించారు. ప్రతీరోజు రెండు విభాగాలుగా సమావేశాలు నిర్వహించాలని, ఉదయం 8నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ప్రజాపాలన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబరు 31, జనవరి 1 మినహా మిగిలిన అన్ని రోజులూ ఈసదస్సులు జరుపుతారు.

దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు

ప్రజాపాలన సదస్సులకు స్థానిక సర్పంచులు/ మునిసిపల్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లను ఆహ్వానిస్తారు. తొలుత ప్రభుత్వ సందే శాన్ని చదివి వినిపిస్తారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా భావిస్తోన్న మహా లక్ష్మీ పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతిపథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, చేయూత పథకానికి దరఖాస్తులను స్వీకరిస్తారు. అదేవిధంగా కొత్త రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు గాను అన్ని విధాల దరఖాస్తులను ఈ సదస్సులో స్వీకరిస్తారు. ప్రజల నుంచి వచ్చే ఇతర ఫిర్యాదులు, వినతిపత్రాలను కూడా స్వీకరించాలని నిర్ణయించారు. ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ముందుగానే ఖాళీ దరఖాస్తులను కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచుతారు. వాటిని ప్రజల కుఅందించి నింపిన తర్వాత మళ్లీ స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రతీ సదస్సు వద్ద 100 కుటుంబాలకు ఒక కౌంటర్‌ చొప్పున ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు నిర్వహిస్తారు. ప్రతీ దరఖాస్తుని ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడంతో పాటు, ప్రతీ దరఖాస్తుకు ఒక ప్రత్యేక నెంబరు కేటాయిస్తారు. డిజిటలైజ్‌ చేయడంతో పాటు, ప్రతీ దరఖాస్తుదారునికి రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. సదస్సుల నిర్వహణలో శాంతిభద్రతల ఇబ్బందుల్లేకుండా పోలీసుల ప్రత్యేక బందోబస్తుతో పాటు, టెంట్లు, తాగనీరు, టేబుళ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలి.

Updated Date - Dec 26 , 2023 | 11:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising