ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - Dec 22 , 2023 | 10:56 PM

మల్దకల్‌ మండల కేంద్రంలోని స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమ య్యాయి.

ధ్వజారోహణం చేస్తున్న రుత్విక్కులు, విజయరాయల ఆరాధనోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

- భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణ

- దంపతులకు ప్రత్యేక ప్రసాద వితరణ

మల్దకల్‌, డిశంబరు 22 : మల్దకల్‌ మండల కేంద్రంలోని స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమ య్యాయి. ఉదయం 11 గంటలకు ఆలయం వద్ద, భక్త జన సందోహం మధ్య ధ్వజారోహణ కార్యక్రమా న్ని అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో రుత్విక్కులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ధ్వజారోహణం అనంతరం శాస్త్రోక్తంగా దేవతలకు ఆహ్వానం పలికారు. ఉత్స వాల్లో భాగంగా మొదటి రోజున సంతానం లేని దంపతులకు ప్రసాదం పంచిపెట్టారు. ఈ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని ప్రజల విశ్వాసం. కార్యక్రమం చైర్మన్‌ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. రుత్వికులు మధు సూదనాచార్యులు, రమేశాచార్యులు, ధీరేంద్రదాసులు, రవి ఆచార్యులు పూజలు నిర్వహించారు.

భక్తిశ్రద్దలతో విజయరాయల ఆరాధన

శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శేషదాసుల మనుమలైన విజయరాయల ఆరాధనోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శేషదాసుల వంశస్థులు వీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు ఆధ్వర్యంలో డాక్టర్‌ ఆందన్‌ అష్టోత్తర పారాయణం, పంచామృతాభిషేకం, హస్తోదకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భజన మండలి సభ్యులు హరినామ సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, రవీంద్ర, మధుసూధనాచారి, భీంసేనాచారి, రాఘవేంద్ర చారి, ప్రసన్న, బాబురాజు, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

నీటి ట్యాంకర్ల ఏర్పాటు

జాతరకు వచ్చే భక్తులు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వర్తకుల సౌకర్యార్థం మల్దకల్‌ యూనియన్‌ బ్యాంకు ఆధ్వర్యంలో నీటి సదుపాయం కల్పించారు. నీటిని సరఫరా చేసేందుకు నాలుగు ట్యాంకర్లను ఏర్పాట్లు చేశారు. శుక్రవారం యూబీఐ బ్యాంకు మేనే జర్‌ గంగాధర్‌, ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు పూజలు చేసి వాటిని ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది నాగేందర్‌, శివశంకర్‌, అచ్యుత్‌, వెంకటమ్మ, రామాచారి, నాగరాజు, మధుసూదన్‌రెడ్డి, నరేందర్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

జాతరకు ప్రత్యేక బస్సులు

వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా జరిగే జాతర కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఆర్‌.మంజుల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయచూర్‌, ఎమ్మిగనూరు, కర్నూలు నుంచి మల్దకల్‌ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 10:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising