ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జోగుళాంబ ఆలయాన్ని అగ్రగామిగా నిలుపుతాం

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:03 PM

: రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠమైన అలంపూర్‌ జోగుళాంబ దేవి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

సీఎం రేవంత్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న అర్చకులు

హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

అలంపూర్‌, డిసెంబరు 17: రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠమైన అలంపూర్‌ జోగుళాంబ దేవి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఏఐసీసీ జనరల్‌ కార్యదర్శి సంపత్‌కుమార్‌, జోగుళాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్‌ శర్మ ఆదివారం హైదరాబాద్‌లో సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జోగుళాంబదేవి అమ్మవారి జ్ఞాపికతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం చేపట్టాల్సిన వివిధ పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అలంపూర్‌ ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించుకుంటామని, దేవాదాయ, పర్యాటక, పురాతత్వశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.

Updated Date - Dec 17 , 2023 | 11:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising