Kumaram Bheem Asifabad: మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:02 PM
జిల్లాలోని 139 మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు తీపి కబురు చెప్పింది. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలు గా అప్‌గ్రేడ్ చేస్తూ అందులో పని చేస్తున్న టీచర్లకు వేతనాలు పెంచేం దుకు నిర్ణయం తీసుకుంది.
- జీవో జారీ చేసిన ప్రభుత్వం
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 26: జిల్లాలోని 139 మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు తీపి కబురు చెప్పింది. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలు గా అప్‌గ్రేడ్ చేస్తూ అందులో పని చేస్తున్న టీచర్లకు వేతనాలు పెంచేం దుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క తొలి సంతకం ఆ ఫైలుపై చేయడంపై అంగన్‌వాడీలో హర్షం వ్యక్తం అవుతుంది.
మొయిన్ టీచర్లల విధులు..
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 139 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు 139 మంది మినీ టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా మినీ కేంద్రాలలో టీచర్‌తోపాటు ఆయా పోస్టును కూడా వీరే నిర్వహిస్తు వస్తున్నారు. మెయిన్ సెంటర్ టీచర్ గా ఉన్నవారు నిర్వర్తించే సరిసమాన విధులతో పాటు అదనంగా అయా డ్యూటీని కూడా వీరే చూసుకుంటున్నారు. అయినప్పటికి వేత నాలలో వ్యత్యాసం ఉంది. మినీ టీచర్లకు రూ. 7850 వేతనం వస్తుంటే, మెయిన్ టీచర్లకు 13,450 పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మినీ అంగన్‌వాడీలు తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభు త్వం మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
పోస్టుల భర్తీకి అవకాశం..
మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ కావడంతో మరో అవకాశం దక్కనుంది. మెయిన్ కేంద్రాల నిర్వహణకు తప్పనిసరిగా ఒక టీచర్‌తో పాటు అయా అవసరం ఉంటుంది. ఈ నేప థ్యంలో 139 కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ అవుతుండటంతో 139 మంది అయాలను భర్తీ చేసే అవకాశం ఏర్పడుతుంది. మినీ కేంద్రాలన్నీ మెయిన్ కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాక అయాల పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తొంది.
జిల్లా వ్యాప్తంగా..
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 139 కేంద్రాలు మినీ అంగన్‌వాడీ కేంద్రాలుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనుంది. దీంతో జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్య 973కు పెరగనుంది.
అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు..
- సావిత్రి, జిల్లా సంక్షేమాధికారిణి
మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రక టించింది. జిల్లాలో 139 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రభు త్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రక్రియను ప్రారంభిస్తాం.
Updated Date - Dec 26 , 2023 | 10:03 PM