లోక్‌అదాలత సాక్షిగా ఒక్కటైన జంటలు
ABN, Publish Date - Dec 30 , 2023 | 11:32 PM
లోక్‌అదాలత సాక్షిగా మూడు జంటలు ఒక్కటయ్యాయి. క్షణికావేశంతో కోర్టు మెట్టెక్కిన దంపతులు లోక్‌అదాలత సాక్షిగా ఒక్కటయ్యారు.
సూర్యాపేటలీగల్, డిసెంబరు 30 : లోక్‌అదాలత సాక్షిగా మూడు జంటలు ఒక్కటయ్యాయి. క్షణికావేశంతో కోర్టు మెట్టెక్కిన దంపతులు లోక్‌అదాలత సాక్షిగా ఒక్కటయ్యారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్‌అదాలతలో చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన అక్కినపల్లి లింగయ్య-విజయలకు 2001లో వివాహం జరగ్గా, వారి మధ్య మనస్పర్థల కారణంగా 2019 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన గుండు నాగరాజు-నిష వివాహం 2019లో జరగ్గా రెండు నెలలకే విడివిడిగా ఉండాల్సి రాగా వారు కోర్టును ఆశ్రయించారు. మరో జంట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగతసింగ్‌నగర్‌కు చెందిన అక్కెనపల్లి నాగరాజు-సుజాతల వివాహం 2003లో జరగగా తీవ్ర మనస్పర్థల కారణంగా నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆయా జంటల పిల్లల బంగారు భవిష్యతను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులుగా కుటుంబ బాధ్యతలు, నిర్వహించాల్సిన నైతిక బాధ్యత వారిపై ఉంటుందని లోక్‌అదాలత చేసిన సూచనల మేరకు మూడు జంటలు ఒక్కటయ్యాయి. జిల్లా న్యాయసేవాసంస్థ చైర్మన, ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి జి.రాజగోపాల్, సెక్రెటరీ సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీవాణి ఎదుట పూలదండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మూడు జంటలు ఒకటి కావడం ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిందన్నారు. భార్యాభర్తలుగా, పిల్లలకు తల్లిదండ్రులుగా నిర్వర్తించాల్సి బాధ్యతలను సమర్ధంగా పూర్తి చేయాలన్నారు.
హుజూర్‌నగర్‌లో
హుజూర్‌నగర్ : పదేళ్ల కిందట విడిపోయిన రెండు జంటలు లోక్‌అదాలత సాక్షిగా ఒక్కటయ్యాయి. న్యాయమూర్తి కౌన్సెలింగ్‌తో కలిసి జీవించేందుకు అంగీకరించారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రం విజయవాడకు చెందిన ఉప్పల సురే్‌షబాబు, కోదాడకు చెందిన లక్ష్మి, అదేవిధంగా కోదాడకు చెందిన ముత్తవరపు సాయి, శైలజసందీ్‌పలు జీవిత భాగస్వాములుగా ఉన్నారు. ఈ రెండు జంటలు తాము వేర్వేరుగా ఉంటామని కోరుతూ ఆరు నెలల కిందట హుజూర్‌నగర్ సీనియర్ సివిల్ జడ్జిని ఆశ్రయించారు. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలతలో రెండు జంటలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, సీనియర్ సివిల్ జడ్జి శ్యాంకుమార్, జూనియర్ సివిల్ జడ్జి మారుతీప్రసాద్, బార్ ప్రెసిడెంట్ సాముల రాంరెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండు జంటలు అంగీకరించి, దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు. దీంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు రెండు జంటలను అభినందించారు.
సూర్యాపేటలో 6797కేసుల పరిష్కారం
సూర్యాపేటలీగల్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలతలో 6,797 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో 427 క్రిమినల్ కేసులు కాగా, మోటారు ప్రమాదాలకు సంబంధించి 72 కేసులు, కుటుంబ వివాదాలకు సంబందించి 11కేసులు, 12సివిల్ కేసులు, ఎనఐ యాక్టుకు సంబంధించి 21 కేసులు, ఎక్సైజ్‌కు సంబంధించి 15, 12 ఇతర కేసులు, మోటార్ వాహన ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో రూ.33,99,93,396 బాధిత కుటుంబాలకు చెల్లించేందుకు ఆయా బీమా కంపెనీలు లోక్‌అదాలతలో అంగీకరించినట్లు పేర్కొంది. ఆయా బ్యాంకుల రుణ ఖాతాదారుల నుంచి రావాల్సిన, బీఎ్‌సఎనఎల్ సైతం పాత బాకీలను రాబట్టుకున్నాయి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన, ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి జి.రాజగోపాల్ పర్యవేక్షణలో లోక్‌అదాలత బెంచీలను ప్రొసీడింగ్ అధికారులుగా మొదటి జిల్లా అదనపు జడ్జి ఎన.అమరావతి, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సురేష్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జే ప్రశాంతి వ్యవహరించారని పేర్కొంది.
Updated Date - Dec 30 , 2023 | 11:32 PM