ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అందెశ్రీ?

ABN, Publish Date - Dec 30 , 2023 | 03:00 AM

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కోటా కింద టీజేఎస్‌ అధినేత కోదండరాం, ప్రజా కవి అందెశ్రీని శాసనమండలికి పంపనుందా? ఎమ్మెల్సీలుగా వీరిద్దరి పేర్లను పరిశీలిస్తోందా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి.

ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సామాజిక, సాహిత్య రంగాల్లో అవకాశం

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కోటా కింద టీజేఎస్‌ అధినేత కోదండరాం, ప్రజా కవి అందెశ్రీని శాసనమండలికి పంపనుందా? ఎమ్మెల్సీలుగా వీరిద్దరి పేర్లను పరిశీలిస్తోందా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం గవర్నర్‌ కోటా కింద శాసనమండలిలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు కోదండరాం, అందెశ్రీలను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న పరిశీలన జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కోదండరాం బేషరతుగా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన్ను గౌరవప్రదమైన పదవిలోకి తీసుకుంటామంటూ ఆ పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కోదండరామ్‌కు ప్రభుత్వ సలహాదారుగా లేదా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వేం నరేందర్‌రెడ్డితో పాటు మరొకరి పేరును పరిశీలిస్తున్నారు.

రాజ్యసభ సీటుకు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డితో పాటు మరి కొందరు సీనియర్‌ నాయకులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోదండరాంను ప్రభుత్వ సలహాదారుగా తీసుకోవాలా.. లేక గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయాలా అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో సహకరించిన అందెశ్రీని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయాలన్న ప్రతిపాదనా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌, కె.సత్యనారాయణ పేర్లను సిఫారసు చేసింది. అయితే గవర్నర్‌ కోటా కింద ఎంపికయ్యే అర్హత వారికి లేదంటూ గవర్నర్‌ తమిళిసై ఆ సిఫారసును తిరస్కరించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ రెండు స్థానాలనూ సామాజిక రంగంలో సేవలందించిన కోదండరాం, సాహిత్య రంగంలో సేవలందించిన అందెశ్రీ పేర్లను సిఫారసుచేసే అంశంపై పరిశీలన జరుగుతున్నట్లు చెబుతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఖాళీ ఏర్పడింది. ఆ నియోజకవర్గానికి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా ఈసీ శుక్రవారం ఆదేశించింది. ఓటరు నమోదు కోసం నిర్ణీత షెడ్యూల్‌ను సూచించింది. ఓటర్ల నమోదు ప్రక్రియకు శనివారం పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేయాలని, ఫిబ్రవరి 6కల్లా పూర్తి చేయాలని, అదే నెల 24న ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించాలని పేర్కొంది. ఏప్రిల్‌ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించాలని తెలిపింది.

Updated Date - Dec 30 , 2023 | 03:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising