Singareni: కాక రేపుతున్న సింగరేణి ఎన్నికలు..
ABN, Publish Date - Dec 26 , 2023 | 09:00 AM
సింగరేణి ఎన్నికలు కాక రేపుతున్నాయి. రేపు 7 వ సారి సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 3 సార్లు ఏఐటీయూసీ.. 2 సార్లు టీబీజీకేఎస్ ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి.1998 లో చంద్రబాబు పాలనలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టడం జరిగింది. కేసీఅర్ పాలనలో కార్మిక సంఘాల హక్కులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి ఎన్నికలు కాక రేపుతున్నాయి. రేపు 7 వ సారి సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 3 సార్లు ఏఐటీయూసీ.. 2 సార్లు టీబీజీకేఎస్ ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి.1998 లో చంద్రబాబు పాలనలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టడం జరిగింది. కేసీఅర్ పాలనలో కార్మిక సంఘాల హక్కులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రేవంత్ రెడ్డి సర్కార్‌లో తొలిసారిగా సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పోటీలో ఏఐటీయూసీ వర్సెస్ టీబీజీకేఎస్ ఉన్నాయి. అధికారం అండతో దూకుడుగా ఐఎన్‌టీ యూసీ వ్యవహరిస్తోంది. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడిగా కొత్తగూడెం ఎమ్మేల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
Updated Date - Dec 26 , 2023 | 09:00 AM