ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇందిరమ్మ ఇల్లు.. ఆశలు హరివిల్లు!

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:59 PM

సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సర్కారు రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని చేస్తామని ప్రకటించడంతో జిల్లాలో నిరుపేదలు ఇకనైనా తమ సొంతింటి కల నెరవేరుతుందని, తమ ఆశల హరివిల్లు సాక్షాత్కారమవుతుందని ఉమ్మడి జిల్లాలోని నిరుపేదలు నిరీక్షిస్తున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న కొత్త సర్కారు.. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరుగ్యారంటీ హామీల్లో భాగంగా ఇం

ఉమ్మడి జిల్లాలో కనీసం లక్ష మంది నిరీక్షణ

28 నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రజాప్రభుత్వ నిర్ణయం

కొత్తపథకాల అమలుపై ఖరారు కాని విధివిధానాలు

గత సర్కారులో ‘గృహలక్ష్మి’కి 78,466వేల దరఖాస్తులు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఉమ్మడిజిల్లాలో వివరాలివీ..

మొత్తం కుటుంబాలు : 8,31,020

పూరిగుడిసెల్లో ఉంటున్నవారు : 41,362

సొంత ఇళ్లున్నవారు : 1,87,472

అద్దెఇళ్లలో ఉంటున్నవారు : 1,97,307

సొంత స్థలం ఉన్న వారు : 2,64,534

ఎలాంటి స్థలం లేని వారు : 5,64,734

ఖమ్మం కలెక్టరేట్‌, డిసెంబరు 26 : సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సర్కారు రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని చేస్తామని ప్రకటించడంతో జిల్లాలో నిరుపేదలు ఇకనైనా తమ సొంతింటి కల నెరవేరుతుందని, తమ ఆశల హరివిల్లు సాక్షాత్కారమవుతుందని ఉమ్మడి జిల్లాలోని నిరుపేదలు నిరీక్షిస్తున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న కొత్త సర్కారు.. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరుగ్యారంటీ హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముందుకొస్తోంది. ఈనెల 28 నుంచి ఇంటి జాగా ఉండి ఇళ్లు లేని పేదలకు ముందస్తుగా అవకాశాన్ని కల్పిస్తుండడంతో పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల మంజూరు దరఖాస్తులు ఆహ్వానించగా.. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి 78,466వేల దరఖాస్తులు అందగా.. ఒక్క ఖమ్మం నగరంలోనే 11,150 దరఖాస్తులు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ హామీ అయిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఉమ్మడిజిల్లాలో పది నియోజకవర్గాలకు కనీసం 50వేల ఇళ్లు మంజూరు చేస్తే వీటికోసం కనీసం రూ.2500 కోట్లు అవసరం ఉంటుందని అంచనా. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో రెండు పడకల ఇళ్లు 14,555 మంజూరవగా కేవలం 5,035మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లను ఇచ్చారు. ఇంకా 5,454 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. అయితే డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ప్రక్రియ సక్రమంగా జరగలదేని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండటంతో ఈ పథకం ప్రజల్లో అంతగా విజయవంతం కాలేదు. దీంతో ఇందిరమ్మ పథకం ద్వారానైనా సొంత స్థలం ఉన్నవారికి రూ5 లక్షల నగదును వస్తుందని, సొంతింటి కల నెరవేరుతుందని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 2.64లక్షల మందికి పైగానే

ఉమ్మడి జిల్లాలో 2014లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్రకుటుంబ సర్వే లెక్కల ప్రకారం సొంత జాగా ఉన్న వారు 2,64,534 మంది ఉన్నారని తేలింది. ప్రస్తుతం రెండు జిల్లాలకు కలిపి కనీసం 50వేల ఇళ్లు మంజూరైతే ఇవి కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అవకాశం కలిగే ఆస్కారం కనిపించడం లేదు. గతంలో ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించిన హౌజింగ్‌ శాఖను రద్దు చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖలకు గృహనిర్మాణాలను అప్పగించి పనులు చేయించారు. అయితే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును హౌజింగ్‌ శాఖ పరిశీలిస్తుందా. లేక రెండు పడకల నిర్మాణాలు చేపట్టిన ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పర్యవేక్షించాలా అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.

కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు :

ఉమ్మడి జిల్లాలో ఇళ్లు కావాలంటూ, సొంత స్థలాన్ని కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తున్న ప్రజావాణిలో అర్జీలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాలో 85వేల దరఖాస్తులు అందాయి. వాటి నంచి లబ్ధిదారుల ఎంపిక కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈనెల 28 నుంచి జనవరి 6వరకు గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఒక్కో గ్రామంలో ఇల్లు లేని పేదలు కనీసం 50మంది నుంచి 500 మంది వరకు ఉన్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరు పడిన వారు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కోనియోజకవర్గంలో వేల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తే ఆస్కారం కనిపిస్తోంది. గతప్రభుత్వంలోని గృహలక్ష్మి పథకానికి ఖమ్మం జిల్లాలో మొత్తం 78,466 దరఖాస్తులు రాగా.. ఖమ్మం నియోజకవర్గంలో 11,150, పాలేరులో 13,712, మధిరలో 16,138, వైరాలో 16,295, సత్తుపల్లిలో 19,192, ఇల్లెందు పరిధిలో ఉన్న కామేపల్లి మండలంలో 1,979 మంది దరఖాస్తులు అందించారు.

Updated Date - Dec 27 , 2023 | 07:11 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising