నడుస్తున్న చరిత్రకు ప్రతిబింబం ‘కథ’
ABN, Publish Date - Dec 25 , 2023 | 03:45 AM
కథలు నడుస్తున్న చరిత్రకు ప్రతిబింబమని... అవి సమకాలీన సామాజిక చరిత్రను ముందు తరాలకు అందిస్తాయని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చెప్పారు.
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
నల్లగొండ కల్చరల్, డిసెంబరు 24 : కథలు నడుస్తున్న చరిత్రకు ప్రతిబింబమని... అవి సమకాలీన సామాజిక చరిత్రను ముందు తరాలకు అందిస్తాయని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కళాశాల ఆడిటోరియంలో ‘‘నల్లగొండ కథ పాఠశాల’’ ఆధ్వర్యంలో డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన ‘దురస్తు తెలంగాణ కఽథ-2022’ పుస్తక ఆవిష్కరణ సభకు ఆయన హాజరయ్యారు. కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ తెలుగు కథకు పుట్టినిల్లు అని, ఈ నేలపై తెలుగు కథ గొప్పగా వికసించిందన్నారు. సమావేశంలో కవులు, రచయితలు పగడాల నాగేందర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పెరమాళ్ల ఆనంద్, వెల్దండి శ్రీధర్, సాగర్ల సత్తయ్య, బెల్లి యాదయ్య, భూతం ముత్యాలు, పద్మ, మునాస వెంకట్, అంబటి వెంకన్న, హనీష్, చందు, కృష్ణ కౌండిన్య, మాజీ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, స్కై బాబా పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2023 | 03:45 AM