ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆత్మస్థైర్యం కోసం కర్రసాము ఎంతో అవసరం

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:25 PM

సమాజంలో బాలబాలికల ఆత్మరక్షణ కోసం కరాటేతో పాటు కర్రసాము కూడా ఎంతో ముఖ్యమని తైక్వాండో కరాటే మాస్టర్‌ శ్రీహరి అన్నారు.

కర్రసాములో శిక్షణ ఇస్తున్న తమిళనాడు వాసి శ్రీనివాసులు

- తైక్వాండో కరాటే మాస్టర్‌ శ్రీహరి

- కర్రసాము శిక్షణ తరగతులు ప్రారంభం

గద్వాల అర్బన్‌, డిసెంబరు 17 : సమాజంలో బాలబాలికల ఆత్మరక్షణ కోసం కరాటేతో పాటు కర్రసాము కూడా ఎంతో ముఖ్యమని తైక్వాండో కరాటే మాస్టర్‌ శ్రీహరి అన్నారు. కర్రసాము ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ తమిళనాడుకు చెందిన శ్రీనివాసులు సారథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్‌లో కర్రసాము శిక్షణ తరగతులు రెండు రోజుల పాటు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా మాస్టర్‌ శ్రీహరి హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి సారిగా కర్రసాము విద్యను ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు. అందులో భాగంగానే కర్రసాము మాస్టర్‌ శ్రీనివాసులు సారథ్యంలో జిల్లాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థులు క్రమశిక్షణతో కర్రసాము విద్యను నేర్చుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు తైక్వాండో కరాటేలో శిక్షణ ఇచ్చిన విధంగానే కర్రసాము విద్యలో కూడా తీర్చిదిద్దాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 150 మంది విద్యార్థులు శిక్షణ హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు శెట్టి, రంగస్వామి, రామేశ్వరి, మౌనిక, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising