ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరు గ్యారెంటీల్లో యువ వికాసం మరిచారు

ABN, Publish Date - Dec 31 , 2023 | 11:39 PM

అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌ మె నిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో యువ వికాసంను అమలు చేయడానికి ప్రభు త్వం మరిచిపోయిందని ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు.

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌-

జగిత్యాల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌ మె నిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో యువ వికాసంను అమలు చేయడానికి ప్రభు త్వం మరిచిపోయిందని ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. ఆది వారం పట్టణంలోని తహసీల్ధార్‌ కార్యాలయంలో జగిత్యాలకు చెందిన 71 మందికి కల్యాణ లక్ష్మీ, షాధీముబారక్‌ చెక్కులను అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడారు. యువ వికాసం కార్యక్రమం ప్రకారం 10వ తరగతి నుంచి పీహె చ్‌డీ వరకు చదివే విద్యార్థులకు భృతి అందించాలని డిమాండ్‌ చేశారు. రూ. 4 వేలు ని రుద్యోగ భృతి అందించాల్సి ఉందన్నారు. దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 10వ తర గతి ఉత్తీర్ణులయితే రూ. 10 వేలు, ఇంటర్‌కు రూ. 20 వేలు, డిగ్రీ రూ. 25 వేలు, పీజీ ఉ త్తీర్ణులయితే రూ. లక్ష, పీహెచ్‌డీకి రూ. 5 లక్షలు యువ వికాసంలో మ్యానీఫెస్టోలో ఉం దని వివరించారు. ప్రతి మండలానికి గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పంటకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారని, అమలు చేయడంలో జాప్యం వహిస్తున్నారని ఆరోపించా రు. సంబందిత మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బాండ్‌ రాసి విద్యా నగర్‌లోని రామాలయంలో దేవుని ముందు ఉండి పూజలు చేశారని గుర్తు చేశారు. జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభయహస్త మ్యానీఫెస్టోలోని యువ వికాసంపై స్పష్టత ఇవ్వాలని యువత పక్షాన డిమాండ్‌ చేస్తున్నానన్నారు.

ప్రోటోకాల్‌ విషయంలో కక్ష సాదింపు రాజకీయాలకు కాంగ్రెస్‌ పాటుపడుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో రెండో సారి గెలిచానని, ప్రజల గుండెల్లో ఉ న్నానని, ఫ్లెక్సీల్లో ఫోటోలు తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకతీ తంగా జగిత్యాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపు నిచ్చారు. అభివృద్ధిలో అందరికి సహకరిస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్‌, బీఆర్‌ ఎస్‌ నాయకులు దావ సురేశ్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:39 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising