ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటాం

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:58 PM

సింగరేణి సంస్థను ప్రైవేట్‌ పరం కాకుండా అడ్డుకుంటామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.

యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 18: సింగరేణి సంస్థను ప్రైవేట్‌ పరం కాకుండా అడ్డుకుంటామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. సోమవారం ఓసీపీ-3లో ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఎమ్మెల్యే మాట్లా డారు. తెలంగాణకు తలమానికమైన సింగ రేణిని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చారని అన్నారు. కొత్త గనులు ప్రారంభించలేదని, సింగరేణిని అప్పుల కుప్పగా మార్చినట్టు మక్కాన్‌సింగ్‌ పేర్కొన్నారు. సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సింగరేణి ఉనికిని ప్రమాదంలోకి నెట్టారని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కొత్త గనులు ప్రారంభించేలా కృషి చేస్తామని, సొంత ఇంటి పథకం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసెకెళ్ళనున్నట్టు మక్కాన్‌సింగ్‌ తెలిపారు. బొగ్గు ఆధారిత పరిశ్రమలను కోల్‌బెల్ట్‌ ప్రాంతాల పరిధిలో నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంపై దృష్టి సారించనున్నట్టు మక్కాన్‌సింగ్‌ పేర్కొ న్నారు. జేబీసీసీఐలో జరిగిన ఒప్పందాలను అమలు చేయకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని, ఒప్పందా లను అమలుకు కృషి చేయనున్నట్టు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ పేర్కొ న్నారు. కార్మికుల పక్షాన నిలిచే ఐఎన్‌టీయూసీని గుర్తింపు సంఘంగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా 200 మంది కార్మికులు ఐఎన్‌టీయూసీలో చేరారు. ఈ గేట్‌ మీటింగ్‌లో సత్యనారాయణరెడ్డి, అక్రమ్‌, అక్బర్‌అలీ, శంకర్‌ నాయక్‌, సంపత్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌, భీమిని సత్యనారాయణ, కొంగర రవీందర్‌, ఆకుల రాజయ్య, సలిగంటి రాములు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising