బీఎంఎస్‌లో చేరిన వీకేపీ గని కార్మికులు
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:15 AM
వకీల్‌పల్లెకి చెందిన పలువురు కార్మికులు బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్‌లో చేరారు. శనివారం గని ఆవరణలో జరిగన గేట్‌మీటింగ్‌లో యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 16: వకీల్‌పల్లెకి చెందిన పలువురు కార్మికులు బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్‌లో చేరారు. శనివారం గని ఆవరణలో జరిగన గేట్‌మీటింగ్‌లో యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా సత్తయ్య మాట్లాడా రు. సింగరేణిలో రాజకీయ జోక్యం నివారించేలా బీఎంఎస్ కృషి చేస్తుందని, నిధుల దుర్వినియోగం, నిధుల మళిం్లపుపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. రాజకీయ జోక్యంతో సింగరేణికి చెందిన స్థలాలు, భవనాలు, క్వార్టర్లు అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. కార్మికులు కష్టపడి సంస్థను లాభాలు సాధించిపెడుతుంటే ఇష్టారీతిన ఇతర ప్రాంతాలకు కోట్లాది రూపాయలు గత ప్రభుత్వం మళ్ళించిన ట్టు సత్తయ్య పేర్కొన్నారు. కార్మిక వాడల్లో మౌళిక వసతుల కల్పన మంచి నీటి సరఫరాకు కృషి చేస్తామని, ప్రమోషన్లు సకాలంలో ఇప్పించడం, జేబీసీసీఐ ఒప్పందాలను అమలు చేసేలా బీఎంఎస్ కృషి చేస్తుందని యాదగిరి సత్తయ్య పేర్కొన్నా రు. బీఎంఎస్‌ని గుర్తింపు సంఘంగా గెలిపించాలని కోరారు. ఈగేట్‌మీటింగ్‌లో వడ్డెపల్లి కుమారస్వామి, పెండెం సత్యనారాయణ, బాలయ్య, సత్తయ్య పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:15 AM