ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికుల తీర్పు స్ఫూర్తిదాయకం

ABN, Publish Date - Dec 29 , 2023 | 11:58 PM

గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐ టీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ను గెలిపిం చి కార్మికులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఆర్జీ-2 కార్యదర్శి జిగురు రవీందర్‌, ఇన్‌చార్జి రాజారత్నంలు పేర్కొన్నారు.

యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 29: గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐ టీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ను గెలిపిం చి కార్మికులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఆర్జీ-2 కార్యదర్శి జిగురు రవీందర్‌, ఇన్‌చార్జి రాజారత్నంలు పేర్కొన్నారు. శుక్రవారం ప్రెస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రలోభాల కు లొంగకుండా పనిచేసే సంఘానికి మద్దతుగా నిలవడం స్ఫూర్తిదాయకమని అన్నారు. సింగరేణి పునర్వైభవం ఏఐటీ యూసీ ద్వారా సాధ్యమని కార్మికులు నమ్మకంతో ఉన్నట్టు ఫలి తాల ద్వారా రుజువైనట్టు తెలిపారు. సొంత ఇంటి పథకం అమ లుతో పాటు నాణ్యమైన విద్యా, వైద్యం అందించడం, మెరుగైన క్యాడర్‌ స్కీం అమలు చేయించే సామర్థ్యం ఏఐటీయూసీకి ఉన్న దని భావించి గెలిపించినట్టు పేర్కొన్నారు. కొత్త బావులు ప్రారం భించడం, ఉపాధి అవకాశాలు పెరిగేలా యాజమాన్యంతో ఒత్తి డి తెస్తామని అన్నారు. సింగరేణిలో గతంలో ఉన్న సాజక్‌, టీఎన్‌టీయూసీల మాదిరిగా ఈ ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ కనుమ రుగైనట్టు తెలిపారు. ఉత్పత్తి సాధనలో యాజమాన్యానికి సహక రిస్తామని, కార్మికులపై పనిభారం మోపడం, వేధింపులకు గురి చేస్తే ఊరుకోబోమని రవీందర్‌, రాజారత్నంలు పేర్కొన్నారు. కార్మిక సమ స్యల సాధనలో రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎల్‌ ప్రకాష్‌, అన్నారావు, బుర్ర తిరుపతి, కొండ్ర సత్యనారా యణ, మహేందర్‌, రాజ సాగర్‌, మహమ్మద్‌ అలీ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 11:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising