పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:52 PM
పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ధర్మపురి ఎమ్మేల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
ధర్మారం, డిసెంబరు 28: పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ధర్మపురి ఎమ్మేల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గురు వారం సాయంత్రం ధర్మారంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చి న హామీల ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పథకాలను అమలుచేసే ప్రక్రి యకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. పథకాల పట్ల ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని ఆయన వివరించారు. ప్రతి నిరుపేదలకు ప్రభుత్వ పథ కాలు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు. ఈ కార్యక్ర మంలో డీఆర్‌డీవో, ప్రత్యేక అధికారి శ్రీధర్, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ రజిత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 11:52 PM