రైతుబంధు జమ
ABN, Publish Date - Dec 14 , 2023 | 12:30 AM
యాసంగి పంటకు సంబం ధించి రైతు బంధు డబ్బులను కొత్త ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
జగిత్యాల, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): యాసంగి పంటకు సంబం ధించి రైతు బంధు డబ్బులను కొత్త ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. శాసన సభ ఎన్నికల కోడ్ కారణంగా అన్నదాతల ఖాతాల్లో గత నెలలో జమ చేయకూడదని అప్పటి ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ప్ర స్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పెట్టుబడి సాయం వెంటనే వి డుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలు త ఎకరం వరకు ఉన్న రైతుల ఖాతాల్లో జమయ్యాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగితా రైతులకు రైతులకు విడతల వారిగా జమ కానున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు భరోసా హామీని వచ్చే వానాకాలం నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం ఎకరానికి రూ. 5 వేల చొప్పున గతంలో మాదిరిగానే జమ అవుతున్నాయి.
జిల్లాలో రైతుబంధు ఇలా...
జిల్లా వ్యాప్తంగా రైతుబంధు పొందడానికి 2,36,284 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఇందులో 2,25,122 మంది రైతులు బ్యాంకు ఖా తాలకు సంబందించిన వివరాలను అధికారులకు అందించారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ. 214.37 కోట్ల నిధులను విడుదల చేసింది. జిల్లాల సాగు విస్తీర్ణం 4.12 లక్షల ఎకరాలుగా ఉంది. ఇదిలాఉండగా ఇప్పటి వర కు 15,491 మంది రైతులకు డబ్బులు జమయ్యాయి. మొదట గుంట నుం చి ఎకరం వరకు వ్యవసామయ భూమి ఉన్న రైతులకు జమ చేస్తుండ గా మిగితా రైతులకు విడతల వారిగా ప్రయోజనం చేకూరనుంది. గత ప్రభుత్వం విధి విధానాల ప్రకారమే ఈ సారి రైతు బంధు జమ అవు తున్నాయి. రైతుబంధు డబ్బుల కోసం మిగిలిన రైతులు ఎదురు చూస్తున్నారు.
వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా..
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేల చొప్పున డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధిం చిన విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో రైతుబంధు నిబంధ నల ప్రకారమే ప్రస్తుతం ఈ డబ్బులు జమ చేస్తున్నారు. ఎన్నికల ముం దే గత ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ కోడ్ కారణంగా ఈసీ ఆదేశాల మేరకు అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన వారం రోజుల్లో రైతులకు పెట్టుబడి సాయం అందుతుం డడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలో భాగం గా రూ. 2 లక్షల రుణ మాఫీకి సంబంధించి ఇంకా విధి విధానాలు రూ పొందించాల్సి ఉంది. మరో వైపు కిసాన్ సమ్మాన్ మాదిరిగా ప్రభుత్వ ఉ ద్యోగులుగా ఉండి భూములు ఉన్న వారికి, అదేవిధంగా ఐటీ చెల్లిస్తున్న అన్నదాతలకు రైతు భరోసాలో కోత పడే అవకాశం లేకపోలేదు. చిన్న, సన్న కార రైతులకు పెట్టుబడి సాయం అందించిందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అన్నదాతల్లో ఆనందం...
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్న రైతులకు ప్రభుత్వం తీపి కబు రునందించింది. ఈ డబ్బులతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడా నికి రైతులు సమాయత్తం అవుతున్నారు. దీంతో జిల్లాలో యాసంగి సాగు మరింత ముమ్మరం కానుంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలతో పాటు పలు ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు.
విడతల వారీగా జమ...
- డాక్టర్ సురేశ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లాలో అర్హులైన రైతులందరికీ విడతల వారీగా రైతు బంధు సాయం అందనుంది. రెండు రోజులుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జ మ చేస్తోంది. మొదట ఎకరం వరకు, మిగితా వారికి విడతల వారీగా జమ చేయనుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Updated Date - Dec 14 , 2023 | 12:30 AM