ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజన్న క్షేత్రం భక్తజన సందోహం

ABN, First Publish Date - 2023-12-11T00:19:14+05:30

వేములవాడ, డిసెంబరు 10 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆదివారం భక్తజన సందోహంగా మారింది.

క్యూలైన్లో బారులుదీరిన భక్తులు

వేములవాడ, డిసెంబర్‌ 10 : వేములవాడ, డిసెంబరు 10 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆదివారం భక్తజన సందోహంగా మారింది. కార్తీకమాసం ముగుస్తుండడం, వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా లఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. అనుబంఽధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తుల సంఖ్య భారీగా ఉండడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలో కార్తిక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో డి కృష్ణ ప్రసాద్‌ నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-12-11T00:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising