సీహెచ్‌పీని సందర్శించిన రైల్వే అధికారులు
ABN, Publish Date - Dec 29 , 2023 | 11:56 PM
ఓసీపీ-3 కోల్‌హ్యాడ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)ని శుక్రవారం రైల్వే అధికారులు పరిశీలించారు.
యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 29: ఓసీపీ-3 కోల్‌హ్యాడ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)ని శుక్రవారం రైల్వే అధికారులు పరిశీలించారు. సీహెచ్‌పీ లో జరుగుతున్న బొగ్గు రవాణాపై సమీక్షించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం రైల్వే ట్రాక్ ఎరక్షన్ లొకేషన్‌పై మరియు కొత్త సైలో బంకర్ సైట్ క్లియరెన్స్ కోసం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న సైలో బంకర్ పనుల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. బంకర్ నిర్మాణ సమయంలో రైల్వే వ్యాగన్ల కదలికలపై శ్రద్ధ వహించాలని, రక్షణతో పనులు పూర్తి చేయాలని సివిల్ అధికారులకు సూచించారు. ఓసీపీ-3 క్వారీ నుంచి బొగ్గు ఉత్ప త్తి ప్రక్రియను పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తికి అనుగూణంగా పెరగ నున్న బొగ్గు రవాణాను దృష్టిలో ఉంచుకుని సీహెచ్‌పీ సామర్థ్యంపై సమీక్ష జరిపారు. సీహెచ్‌పీని సందర్శించిన వారిలో రైల్వే ఉన్నతాధి కారులు సురేష్‌రెడ్డి, బస్వరాజ్, ఆర్జీ-2 జీఎం సూర్యనారాయణ, ఏరి యా ఇంజనీర్ నరసింహారావు, సివిల్ డీజీఎం ధనుంజయ, సీహెచ్‌పీ ఇన్‌చార్జి సదానందం ఉన్నారు.
Updated Date - Dec 29 , 2023 | 11:57 PM