ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యనందించాలి

ABN, First Publish Date - 2023-12-06T00:38:56+05:30

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ల్లోని విద్యార్థులకు టీఎల్‌ఎం విధానం ద్వారా విద్యా బోధన చేసి మంచి ఫలితాలు వచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలె క్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు.

జూలపల్లి, డిసెంబరు 5: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ల్లోని విద్యార్థులకు టీఎల్‌ఎం విధానం ద్వారా విద్యా బోధన చేసి మంచి ఫలితాలు వచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలె క్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. మండలంలోని కాచాపూర్‌ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం కలెక్టర్‌ ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా తరగతి గదిలో విద్యార్థులకు ఉపాధ్యాయుల బోధన విధానంపై విద్యార్థులను అడిగితెలుసుకు న్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రమాణాలు, నైపుణ్యాన్ని మరింతగా పెంచేందుకు ఉపాధ్యాయులు టీఎల్‌ఎం విధానం అనుసరించి బోధించాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు బోధన మెలకువలతో విద్యార్థుల స్థాయిని నిర్ధారిం చి వారికి బోధించాలన్నారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే చ దవడం రాయడం కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంచాలన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన కిచెన్‌ గార్డెన్‌ను పరిశీలించిన కలెక్టర్‌ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పోషకవిలువలు కలిగిన ఆకుకూరలు, కూరగాయలు పండించి వాటిని మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందించాలన్నారు. కిచెన్‌ గార్డెన్‌లో నీటి వసతి సౌకర్యం కోసం 35వేల రూపాయలను మంజూరు చేయను న్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మాధవి, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, సర్పంచ్‌ బంటు ఎల్లయ్య, మాజీ సర్పంచ్‌ అడప లక్ష్మన్‌, పంచాయతీ కార్యదర్శి శరత్‌, మారు పాక కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-06T00:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising