కార్మిక సంఘాల ఏర్పాటులో ప్రభాకర్ కృషి గొప్పది
ABN, Publish Date - Dec 31 , 2023 | 11:41 PM
కార్మిక సంఘాల ఏర్పాటులో కామ్రెడ్ సి. ప్రభాకర్ కృషి గొప్పదని సీపీఐ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అ న్నారు.
- సీపీఐ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి
కోరుట్ల, డిసెంబరు 31 : కార్మిక సంఘాల ఏర్పాటులో కామ్రెడ్ సి. ప్రభాకర్ కృషి గొప్పదని సీపీఐ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అ న్నారు. ఆదివారం పట్టణంలో కామ్రెడ్ సి. ప్రభాకర్ 30వ వర్ధంతిలో చాడ వెం కట్ రెడ్డి జిల్లా నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అరుణ పథకా న్ని ఆవిష్కరించిన నాయకులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిం చా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చాడ వెంకట రెడ్డి మాట్లాడా రు. జిల్లాలో బీడి పరిశ్రమలు నిలదొక్కుకోవడంలో ప్రభాకర్ పాత్ర కీలకమని దీనితో పాటు హమాలీ, ట్రాక్టర్ డ్రైవర్, మున్సిపల్ కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడంలో ఆయన కృషి గొప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న బోజన కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి అందవలసిన పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గం సమావేశం నిర్వహించి కార్మికుల సమస్యలపై చేయవలసిన ఆందోళనతో పాటు పలు అంశా లపై తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేష్, నాయకులు బోయిన ఆశోక్, చెన్న విశ్వనాథం, సుతారి రాములు, ఎండి ఉస్మాన్, ములుగురి హనుమంతు, ఇరువురాల భూమేష్, ఎండి అక్రం, శ్రీగాద దేవదాసు, కోరి కంటి శ్రీనివాస్, మాడిశెటిట కిరణ్, మహేష్, గణేష్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 11:41 PM