ఘనంగా క్రిస్మస్ సంబరాలు
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:17 AM
లోక రక్షకుడిగా పిలిచే క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు సంబరంగా జరుపుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బెతెస్తా చర్చి, సీఎస్‌ఐ చర్చి, హార్మోన్ గాస్పల్ మినిస్ర్టీ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
లోక రక్షకుడిగా పిలిచే క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు సంబరంగా జరుపుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బెతెస్తా చర్చి, సీఎస్‌ఐ చర్చి, హార్మోన్ గాస్పల్ మినిస్ర్టీ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి క్రైస్తవులు చర్చిలకు తరలి వచ్చి ప్రార్థనలు చేశారు. కానుకలు సమర్పిం చుకున్నారు. చర్చిల్లో నిర్వహించిన సాంస్కృ తిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా కేంద్రంతోపాటు వివిధ మండలాల్లోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఘన ంగా నిర్వహించారు. సిరిసిల్ల చంద్రంపేటలో హార్మోన్ గాస్పల్ మినిస్ట్రీ చర్చిలో సంబరాలు నిర్వహించారు. క్రైస్తవులకు జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ముఖ్యంగా క్రైస్తవుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారన్నారు. క్రిస్మస్ సందర్భంగా కానుకలు అందించడంతో పాటు విందులు కూడా ఏర్పాటు చేశారన్నారు. యువతకు ఉపాధికి రుణాలు, వంటి ఎన్నో పథకాలు అందించారన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ క్రైస్తవులకు పూర్తి స్థాయిలో సహాయ సహాకారాలు అందించనున్నట్లు చె ప్పారు. క్రీస్తు ప్రేమ కరుణ, శాంతి అనే సుగుణాలను బోధించారని, ఆయన బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని అన్నారు. వేడుకల్లో చర్చిల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, రైతు బంధు మాజీ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, ప్రముఖ న్యాయవాది ధర్మేందర్, కాంగ్రెస్ నాయకులు వైద్య శివప్రసాద్, బీఆర్‌ఎస్ రైతు బంధు మండల అధ్యక్షుడు అగ్గిరాములు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:17 AM