బాలబాలికల్లో ఆత్మస్థైర్యానికి జూడో క్రీడ దోహదం
ABN, First Publish Date - 2023-12-06T00:40:27+05:30
ఆత్మరక్షణకు, ఆత్మస్థైర్యానికి, విశ్వా సానికి జూడో క్రీడ ఎంతో దోహదపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు.
సుల్తానాబాద్, డిసెంబర్ 5: ఆత్మరక్షణకు, ఆత్మస్థైర్యానికి, విశ్వా సానికి జూడో క్రీడ ఎంతో దోహదపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. జిల్లా జూడో అసోసియోషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లో నిర్వహిస్తున్న ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బాలబాలికల సబ్‌జూనియర్ జూడో పోటీలను ఆయన జ్యోతిప్రజ్వ లన చేసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కరీంనగర్ కేంద్రంగా జరిగే జూడో పోటీలు పెద్దపల్లిలో జరగడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల ద్వారా కూడా ఉన్నత అవకాశాలు వస్తాయన్నారు. భవిష్యత్తులో జూడో క్రీడను విస్తరిం చడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర జూడో సంఘం అధ్యక్షుడు గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, సుల్తానాబాద్ సీఐ జగదీష్ మాట్లా డుతూ క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఓలంపిక్స్‌లో అడే జూడో క్రీడలు సుల్తానాబాద్‌లో జరగడం అభినం దనీయమన్నారు. జిల్లా జూడో సంఘం చైర్మన్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు మాటేటి సంజీవ్‌కుమార్, ప్రధానకార్యదర్శి సిలి వేరి మహేందర్ మాట్లాడుతూ తొలిసారిగా రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు 19జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్‌లు, మేనేజర్‌లు హాజరైనట్టు తెలిపారు. ఈ పోటీల్లో రాణించిన వారు ఈనెల 14 నుంచి 18 వరకు కేరళ రాష్ట్రంలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికవుతారన్నారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ బిరుదు సమత క్రిష్ణ, భారత జూడో అసోసియోషన్ కోశాధికారి కైలాసం యాదవ్, పెద్దపల్లి జిల్లా క్రీడాధికారి సురేష్, కేడీసీసీబీ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, కృష్ణప్రియ, రవీందర్, సురేందర్ పలువురు పీఈటీలు క్రీడా సంఘాల ప్రతిని ధులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-06T00:40:40+05:30 IST