ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజాక్షేత్రంలో... ప్రచార అస్త్రం

ABN, First Publish Date - 2023-11-10T00:06:37+05:30

నామినేషన్ల ధాఖలు తుది దశకు చేరుకోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయి ప్రచారం పై దృష్టి సారించారు.

జగిత్యాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ల ధాఖలు తుది దశకు చేరుకోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయి ప్రచారం పై దృష్టి సారించారు. ఇంటింటి ప్రచారంతో పాటు ప్రధాన నాయకుల రోడ్‌ షోలు, బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేం దుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియో జకవర్గాల్లో ప్రధాన రాజకీయ పక్షాల నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తు న్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించగా పలు చిన్నా చితక పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం అధికార అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే ఉండగా కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ బరిలో ఉన్నారు. ఎలాగైనా ఈ దఫా జగిత్యాల జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తుండగా ఈ దఫా సత్తా చాటాలని బీజేపీ అభ్యర్థులు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు సైతం ఇక్కడ ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

జోష్‌లో బీఆర్‌ఎస్‌...

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేసిన అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్ల అనంతరం రెండో దశ ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లాలోని ధర్మ పురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మా కునూరి సంజయ్‌ కుమార్‌, కోరుట్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్‌ పోటీలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్ప టికే కోరుట్ల, ధర్మపురిలో ప్రచార సభలను నిర్వహించారు. జిల్లా, నియో జకవర్గ నాయకులు రోడ్‌షోలు, జగిత్యాలలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ లతో ప్రచారాన్ని మరింత వేడెక్కించేందుకు సిద్ధమతుతున్నారు. నియోజ కవర్గాల వారిగా నియమించిన సమన్వయకర్తలు ప్రచార వ్యూహాలను ప ర్యవేక్షిస్తూనే ఇతర పార్టీలోని అసమ్మతి నేతలను పార్టీలో చేర్చుకునే వి ధంగా మంతనాలు చేస్తున్నారు. అభ్యర్థి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలంతా ఒకటికి రెండు సార్లు ఇంటింటికి తిరిగేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.

బీసీ నినాదంతో కమలం..

ప్రస్తుతం బీజేపీ ఫుల్‌ జోష్‌లో ఉండి తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. జగిత్యాల జిల్లాలో ఎలాగైనా మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అగ్రనేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాల్లో పోటీలో నిలిచిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, బోగ శ్రావణి ప్రవీణ్‌, ఎస్‌ కుమార్‌ గణనీయ ఓట్లు సాధించేందుకు అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అవుతారనే నినాదం నేపథ్యంలో గణనీయ సంఖ్యలో ఓట్లు వస్తాయని అభ్యర్థులు భావిస్తున్నా రు. ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన మోదీ సంకల్ప సభ విజయవంతం కావడం బీజేపీ అభ్యర్థులకు మరింత జోష్‌ ఇచ్చినట్లయిం ది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నేతలకు షెడ్యూల్‌ రాగా తేదీ ఖరారు కావాల్సి ఉందని పార్టీ నేతలు వెల్లడించారు.

ఆరు గ్యారెంటీలతో హస్తం...

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో జి ల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారాన్ని ము మ్మరం చేస్తున్నారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామి నేషన్‌ వేయగా నామినేషన్‌ అనంతరం పూర్తి స్థాయిలో కార్యక్షేత్రంలో ఉన్నారు. ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి, కోరుట్ల నియోజకవర్గం నుంచిజువ్వాడి నర్సింగారావు, ధర్మపురి కాంగ్రెస్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నామినేషన్‌లు వేశారు. ఇప్పటికే జిల్లా లోని పలు నియోజకవర్గాల్లో ఇటీవల రాహూల్‌గాంధీ రోడ్‌షో నిర్వహిం చగా పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహం పెరిగింది. దీనిని సానుకూలంగా మలు చుకుంటూ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ప్రజల వద్దకు వెళుతున్నారు. పార్టీకి ఇప్పటికీ సంస్థాగతంగా బలంగా ఉన్న ఓటు బ్యాంకును కాపా డుకొని వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేలా ముఖ్య నేతలు ప్రచార వ్యూహాల్ని రచిస్తున్నారు.

Updated Date - 2023-11-10T00:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising