ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణలో యువతకు కాంగ్రెస్‌ పార్టీ పెద్ద పీట

ABN, First Publish Date - 2023-11-08T23:31:56+05:30

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు కాంగ్రెస్‌ పార్టీ పెద్ద పీట వేస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అభ్యర్థి వొడితెల ప్రణవ్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.

హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ

- అన్ని స్కామ్‌ల్లో కేసీఆర్‌ ఫ్యామిలీ

- ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ

హుజూరాబాద్‌, నవంబరు 8: తెలంగాణ రాష్ట్రంలోని యువతకు కాంగ్రెస్‌ పార్టీ పెద్ద పీట వేస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అభ్యర్థి వొడితెల ప్రణవ్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఏ ఒక్క సామాన్య ప్రజలకు డబుల్‌ బెడ్‌రూం ఇవ్వలేదని, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇక్కడున్న ఈటల రాజేందర్‌ కూడా డబుల్‌ బెడ్‌రూం ఇప్పించలేదన్నారు. కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ పెద్ద అబద్దాల కోరన్నారు. తెలంగాణలో పోలీసులు ప్రవళిక కేసును తప్పుదోవ పట్టించారన్నారు. బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కామ్‌లలో కేసీఆర్‌ ఫ్యామిలీ ఉందన్నారు. ఇంటింటికి లిక్కర్‌ స్కీమ్‌ అన్నట్లు కవిత లిక్కర్‌ వ్యాపారం చేస్తుందన్నారు. తెలంగాణలో 35 వేల మంది మహిళలు మిస్సింగ్‌ అయినా ఏ ఒక్క పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదన్నారు. బీజేపీ గ్యాస్‌ ధర అడ్డగోలుగా పెంచిందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకు సిలిండ్‌ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, సొల్లు బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-08T23:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising