ప్రజా తీర్పును శిరసా వహిస్తా..
ABN, First Publish Date - 2023-12-06T00:42:13+05:30
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తాన ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.
పెద్దపల్లిటౌన్, డిసెంబరు 5: ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తాన ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండుసార్లు ప్రజలు ఓటు వేసి నన్ను గెలిపించారని, తన బాధ్యతగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశాన న్నారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తనను తిరస్కరించారనన్నారు. ఇం దుకు ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నానన్నారు. ప్రజా స్వామ్యంలో గెలుపోటము లు సహజమని, తనకోసం పాటుపడ్డ నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయర మణారావుకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుచేయాలని సూచించారు. లేకుంటే ఆందోళన కార్యక్రమలు చేపడుతామని సూచించారు. ప్రతిపక్షంలో ఉండి పాలకపక్షానికి సహకరిస్తామని స్పష్టం చేశారు. జ ర్నలిస్టు సంఘాలు తమ సంక్షేమం కోసం ఎన్నోసార్లు విన్నవించినా స్పందించలేద న్నారు. కనీసం హక్కుల్లో ఏఒక్కటి నేరవేర్చలేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు జర్నలిస్టులను ఇబ్బదులకు గురిచేశానని,తనను క్షమించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంట రాములు, జడల సురేందర్, పెంచాల శ్రీధర్, బం డారి శ్రీనివాస్, ఉప్పు రాజ్‌కుమార్, ప్రశాంత్‌రెడ్డి మమతారెడ్డి, తబ్రెస్, కాశిపాక వాసు, దేవనంది దేవరాజ్ తదితరులున్నారు.
Updated Date - 2023-12-06T00:42:22+05:30 IST