ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వసతి గదులపై జీఎస్టీ

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:13 AM

టారిఫ్‌తో సంబంధం లేకుండా ప్రతీ వసతి గది అద్దెపై జీఎస్టీ వసూలు చేయాలన్న నిర్ణయంతో పేద భక్తులపై అదనపు భారం పడుతోంది.

వేములవాడ, డిసెంబరు 16: టారిఫ్‌తో సంబంధం లేకుండా ప్రతీ వసతి గది అద్దెపై జీఎస్టీ వసూలు చేయాలన్న నిర్ణయంతో పేద భక్తులపై అదనపు భారం పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సంబంధించి ఇప్పటి వరకు దినసరి అద్దె వెయ్యి రూపాయలు దాటిన వసతి గదిపై మాత్రమే జీఎస్టీ వసూలు చేసేవారు. ఇకపై టారిఫ్‌తో సంబంధం లేకుండా ప్రతీ గది అద్దెపై జీఎస్టీ వసూలు చేయాలని ఉత్తర్వులు రావడంతో కొద్ది రోజులుగా రాజన్న భక్తుల వద్ద అదనంగా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. వెయ్యి రూపాయలకు పైగా అద్దె ఉన్న ఏసీ గదుల్లో సౌకర్యాలు ఎక్కువ ఉన్న కారణంగా జీఎస్టీ చెల్లింపు పై భక్తులకు పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. ఇప్పుడు కనీస సౌకర్యాలు లేని 100 రూపాయల అద్దె గదిపై కూడా 12 శాతం మొత్తాన్ని జీఎస్టీ కింద వసూలు చేయడంతో భక్తులు లబోదిబోమంటున్నారు. నిర్వహణ పరంగా అధ్వానంగా ఉన్న గదుల్లో ఉండడానికి ఇబ్బంది పడుతున్న భక్తులు అద్దెకు అదనంగా జీఎస్టీ చెల్లించాలనే నిబంధన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపై ఏటా రూ. 30 లక్షలకుపైగా అదనపు భారం

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు వసతి గదుల అద్దె కోసం జీఎస్టీ రూపంలో ఇకపై ప్రతీ సంవత్సరం 25 లక్షల నుంచి30 లక్షల రూపాయలకు పైగా అదనంగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. రాజన్న ఆలయంలో సుమారు 400 వసతి గదులు ఉండగా ఇందులో 120కి పైగా ఏసీ గదులు, ఎనిమిది ఏసీ సూట్లు, నాలుగు ఏసీ గెస్ట్‌ హౌస్‌లు ఉన్నాయి. ఏసీ గదులు, సూట్లు, గెస్ట్‌ హౌస్‌ల రోజువారి అద్దె కనీసం 900 రూపాయల నుంచి రెండున్నర వేల వరకు ఉండగా, నాన్‌ ఏసీ గదులకు సంబంధించి వేర్వేరు ధర్మశాలల్లో 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. గతంలో వెయ్యి రూపాయలు అద్దె దాటిన గదులకు మాత్రమే జీఎస్టీ వసూలు చేసే పరిస్థితి ఉండడంతో నందీశ్వర కాంప్లెక్స్‌లోని ఏసీ గదులకు సైతం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం వచ్చేది కాదు. ప్రస్తుతం ప్రతీ గదికి జీఎస్టీ వసూలు చేయాలన్న నిబంధన అమల్లోకి రావడంతో ప్రతీ భక్తుడు జీఎస్టీ రూపంలో అదనపు మొత్తాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఆలయ అధికారుల లెక్కల ప్రకారం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో రాజన్న ఆలయ ఖజానాకు వసతి గదుల అద్దె ద్వారా 2.55 కోట్ల రూపాయల ఆదాయం లభించగా, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 3.49 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు 23వ తేదీ నాటికి 2.16 లక్షల రూపాయల ఆదాయం వసతి గదుల అద్దె ద్వారా ఆలయానికి సమకూరింది. మొత్తం ఆదాయంలో 60 శాతం ఆదాయం వెయ్యి రూపాయల లోపు అద్దె ఉన్న గదుల ద్వారా వచ్చి ఉంటుందనే అంచనాల ప్రకారం ఇకపై భక్తులు వసతి గదుల అద్దెకు చెల్లించే జీఎస్టీ ద్వారా ప్రతి సంవత్సరం కనీసం 30 లక్షల నుంచి40 లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పేదల దేవుడుగా పిలుచుకునే రాజన్న ఆలయంలో వసతి గదుల అద్దె రూపంలో భక్తుల నుంచి లక్షలాది రూపాయలు అదనంగా ముక్కు పిండి వసూలు చేస్తున్న వైనం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. పేద భక్తుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెయ్యి రూపాయల లోపు అద్దె ఉన్న గదులపై 12 శాతం జీఎస్టీ విధించే విధానాన్ని ఉపసంహరించుకునే విధంగా ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising