సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:45 PM
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
మంథని, డిసెంబరు 18: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. స్థానిక ఎం పీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమా వేశానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్నికల తర్వాత ప్రజల నిర్ణయం మేరకు నూతన ప్రభుత్వం ఏర్పడింద ని, ఇకపై వ్యక్తి కేంద్రంగా కాకుండా ప్రజల కేంద్రంగా, ప్రజా సంక్షేమమే అభి వృద్ధే ధ్యేయంగా పాలన సాగుతుందన్నారు. ప్రభుత్వ పాలనలో ఇకపై పారదర్శ కత, జవాబుదారీతనం తీసుకవస్తామని, త్వరలో సిటిజన్ చార్టర్ ప్రవేశపెడుతా మని, నాయకులు, అధికారులు పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలనుంచి వచ్చే దర ఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, కార్యాలయాల చుట్టూ ప్రజల ను తిప్పించుకునే అలవాటు మానివేయాలని, ప్రతి దరఖాస్తుకు స్పందించాలని, ఆ సమస్య పరిష్కారం తమ పరిధిలో లేకుంటే అది తెలియజేస్తూ వెంటనే దర ఖాస్తుదారుడికి లేఖ రాయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల సమయం వృథా చేయవద్దన్నారు. ప్రభుత్వ అధికారులు ఇక నుంచి నిబంధనలకు అనుగుణంగా విధులు పకడ్బందీగా ప్రజాసేవ దృష్టిలో ఉంచుకునే నిర్వహించాలని, అధికారు లపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి ఉండదని, ప్రజలకు సుపరిపాలన అందించ డంలో తమవంతు సంపూర్ణ సహకారం అందజేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చి న మాట ప్రకారం ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, అర్హులైన వారందరికీ అందేవిధంగా అధికారులు కృషి చేయాలన్నా రు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, సింగిల్‌విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎంపీడీవో రమేష్, తహసీల్దార్ రాజయ్య, డీఎల్‌పీవో రాంబాబు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మంథనికి వన్నె తెచ్చేలా..
ఎన్నికల్లో తనకు అండగా నిలుస్తూ విజయాన్ని చేకూరుస్తున్న మంథనిప్రాం తానికి, ప్రజలకు వన్నెతెచ్చేలా తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంత్రి హోదాలో తొలిసారి మంథ నికి వచ్చిన శ్రీధర్‌బాబు స్థానిక అంబేద్కర్‌చౌక్‌లో ఆదివారం అర్ధరాత్రి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 9ఏళ్లపాటు బీఆర్‌ఎస్ పాలనలో మంథనిలో అరాచ కాలు జరిగాయని, కాంగ్రెస్ శ్రేణులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. న్యాయవాది వామన్‌రావుతో పాటు ఆయన సతీమణిని దారుణం గా చంపారని, బీఆర్‌ఎస్ చేసిన తప్పులను తాను, తమ పార్టీ శ్రేణులు చేయ బోమన్నారు. మంథనిలో పోలీసు యంత్రాంగం బీఆర్‌ఎస్ యంత్రాంగంగా పని చేసిందన్నారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా కూడా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
దత్తాత్రేయస్వామి ఆలయంలో పూజలు..
స్థానిక శ్రీదత్తాత్రేయస్వామి ఆలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు శ్రీధర్ బాబును ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఆవరణలో డివిజన్‌లో ని క్రిస్టియన్ సంఘాల ఆధ్వ ర్యంలో సోమవారం జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో డివిజన్‌లోని పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:45 PM