ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓడినా పదేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేశాను

ABN, First Publish Date - 2023-11-10T23:43:36+05:30

రెండుసార్లు నన్ను ఓటమి చెందినా కూడా పదేళ్ళుగా ప్రజల సమస్యల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తున్నానని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్‌ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు.

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 10: రెండుసార్లు నన్ను ఓటమి చెందినా కూడా పదేళ్ళుగా ప్రజల సమస్యల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తున్నానని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్‌ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం పెద్దఎత్తున నిర్వహించిన ర్యాలీలో జెండా చౌరస్తాలో మాట్లాడారు. నన్ను తిరస్కరించిన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడు తున్నారని వివరించారు. డబ్బులతో రాజకీయం చేస్తూ ని యోజకవర్గాన్ని భ్రష్ట్టు పట్టించాడన్నాడని మండిపడ్డారు. కరోనా కాలంలో పట్టించుకొని చైర్‌పర్సన్‌ డాక్టరమ్మ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థి స్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే దాసరి తన భూములు ఆస్తుల చుట్టూ అభివృద్ధి చేసుకున్నాడే తప్ప పట్టణంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. తనను గెలిపిస్తే తైబజా ర్‌, ట్రేడ్‌ లైసన్స్‌ ఫీజు ఎత్తివేస్తానని, అలాగే కూరగాయల మార్కెట్‌ తరలింపును నిలిపి వేస్తానని హామీ ఇచ్చారు. 20రోజులు కష్టపడి గెలిపించండి 60 నెలలు మనస్పూర్తిగా సేవలందిస్తానని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమెమల్యే బిరుదు రాజమల్లు, ఎల్‌ రాజయ్య, మాజీ జడ్పీటీసీ గోపగాని సారయ్య గౌడ్‌, అంతటి అన్నయ్యగౌడ్‌, మినుపాల ప్రకాష్‌రావు, నూగిళ్ళ మల్లయ్య, ఊట్ల వర ప్రసాద్‌, సయ్యద్‌ మస్రత్‌, యాటా దివ్యారెడ్డి, బుషనవేన సురేష్‌గౌడ్‌, సాయిరి మహేందర్‌, జగదీష్‌లతో పాటు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పెద్దపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ పాగాల సోనీ, ఆమె భర్త బీఆర్‌ఎస్‌ నాయకుడు పాగాల శ్రీకాంత్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో వారికి కాంగ్రెస్‌ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాం గ్రెస్‌ పార్టీయేనని, బీఆర్‌ఎస్‌ విధానాలు నచ్చక కాంగ్రెస్‌లో చేరామని, విజయరమణారావు గెలుపు కోసం కృషి చేస్తా మని పాగాల సోని, శ్రీకాంత్‌ అన్నారు.

Updated Date - 2023-11-10T23:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising