ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:58 AM

ప్రభుత్వ పాఠశాల లో చదివే విద్యార్థులకు మంచి విద్య అందించ డంతోపాటు వారి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు.

ఎలిగేడు, డిసెంబర్‌ 27 : ప్రభుత్వ పాఠశాల లో చదివే విద్యార్థులకు మంచి విద్య అందించ డంతోపాటు వారి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. బుధవారం మండలంలోని సుల్తాన్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి కిచెన్‌ గార్డెన్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. పాఠశాల పని తీరుపై ఉపాధ్యాయులతో సమీక్షించి పలు సూ చనలు చేశారు. పాఠశాల విద్యార్థులతో కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ ముచ్చటిస్తూ అందుబాటులో ఉన్న ఇంటర్‌నెట్‌ను వినియోగించి సమాజంలో వస్తున్న మార్పులు, మార్కెట్‌లో వస్తున్న కొత్త టెక్నాలిజీ, నూతన ఉపాధి రంగాలు మొదలగు అంశాలను తెలుసుకోవాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం, కిచెన్‌గార్డెన్‌ ఏర్పాటు, ఉన్నతి కార్యక్రమం, లక్ష్యం కార్యక్రమం అమలుగురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి బాధ్యత తీసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మంచి ఫలితాలు సాధించాల ని సూచించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధన చేపట్టాలని, ప్రతి ఉపాధ్యాయుడు బోధించాల్సిన పాఠ్యాంశాల పై వార్షిక, నెలవారి ప్రణాళిక తయారు చేసుకొని టీఎల్‌ఎం ప్రకారం కట్టుదిట్టంగా బోధన చేయాలన్నారు. విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేస్తూ వారికి పాఠ్యాంశంలోని సారాంశం అర్థమయ్యే విధంగా చూడాలని సూచించారు. ప్రతినెలలో మూడో శనివారం నిర్వహించే పేరెంట్‌, టీచర్స్‌ సమావేశంలో పాఠశాలలో జరిగే విద్యాబోధనపై డెమో నిర్వహించాలని, ఇంటివద్ద పిల్లలు కొంతమంది సమయం చదువుపై దృష్టి సారించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సిన అంశాన్ని వివరించాలని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థులు హాజరు శాతం పెరిగేలా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని, వందశా తం హాజరు లక్ష్యంగా సిబ్బంది, ఉపాధ్యాయులు పనిచేయాలని, పాఠ శాలకు రెగ్యులర్‌గా హాజరుకాని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి తరచూ వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులను త్వరలో కలెక్ట రేట్‌ సందర్శన కోసం తీసుకొనిరావాలని, జిల్లా యంత్రాంగం పనిచేసే తీరును పరిశీలిస్తారని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదే శించారు. కలెక్టర్‌ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, హెచ్‌ ఎం నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:58 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising