ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాలికలకు భరోసా...

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:33 AM

కౌమార దశలోని బాలికల్లో సాధికారిత సాధనకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని సుమారు వంద ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా సాధి కారత క్లబ్బులను ఏర్పాటు చేస్తోంది. గతంలో వీటి సంఖ్య స్వల్పంగా ఉండగా ప్రతి సంవత్సరం ఈ క్లబ్బులను విద్యాశాఖ అధికారులు విస్తరి స్తున్నారు.

- సర్కారు పాఠశాలల్లో సాధికారిత సంఘాల ఏర్పాటుకు కార్యాచరణ

- ఆత్మస్థయిర్యం నింపడమే లక్ష్యంగా ముందుకు

జగిత్యాల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కౌమార దశలోని బాలికల్లో సాధికారిత సాధనకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని సుమారు వంద ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా సాధి కారత క్లబ్బులను ఏర్పాటు చేస్తోంది. గతంలో వీటి సంఖ్య స్వల్పంగా ఉండగా ప్రతి సంవత్సరం ఈ క్లబ్బులను విద్యాశాఖ అధికారులు విస్తరి స్తున్నారు. సమాజంలోని పరిస్థితులు, భిన్న మనస్థత్వాల కారణంగా ఇ ప్పటికీ బాలికలు శారీరక వేధింపులు, అహింస, లైంగిక దాడులు, బాల్య వివాహాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలికలపై రోజు రో జుకూ నేరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలికలు తిరిగొచ్చే వరకు తల్లి దండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. ఇలాంటి సమయంలో బాలికల సంక్షే మానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పాఠశాలల వారిగా బా లికల సాధికారత సంఘాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయడం తో పాటు నిబంధనలను ప్రకటించి సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించారు.

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల సంఖ్య..

జిల్లా వ్యాప్తంగా 838 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. సర్కారు బడుల్లో బాలురకంటే బాలికలు సగానికి పైగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 514 ప్రా థమిక పాఠశాలలు, 91 ప్రాథమికోన్నత పాఠశాలలు, 233 ఉన్నత పాఠ శాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 57,771 మంది విద్యార్థులు ప్రవేశా లు పొంది ఉన్నారు. ఇందులో 25,604 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, 6,438 మంది ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, 25,729 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులున్నారు.

విడతల వారిగా కమిటీల ఏర్పాటు..

విడతల వారీగా ఆయా పాఠశాలల్లో బాలికల సాధికారత కమిటీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ప్రతీ తరగతి నుంచి సెక్షన్ల వారీగా ఇద్దరు విద్యార్థినులతో పాటు ఒక ఉపాధ్యా యిని, ప్రధానోపాధ్యాయుడితో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సదరు పాఠశాలల్లో ప్రతీ నెలా విద్యార్థినులతో ప్రత్యేక సమా వేశం నిర్వహిస్తోంది. కౌమార దశలో బాలికల్లో వచ్చే శారీరక మార్పులు గురించి తెలియజేయడంతో పాటు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పి స్తారు. లింగ సమానత్వంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాల్య వివాహాలు ని రోధించడం, బాలికల హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు జీవన నైపుణ్యాలు, బాలికలపై హింస అరికట్టడంపై శిక్షణ ఇస్తారు. బాలురకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బాలికలు వేధిం పులకు గురైతే వెంటనే స్పందించి ఫిర్యాదు చేసేలా భరోసా కల్పిస్తారు.

కమిటీలో సభ్యుల ఏర్పాటు ఇలా...

జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అధ్యక్షుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కన్వీనర్‌గా మహిళా ఉపాధ్యాయిని, స భ్యులుగా ప్రతి తరగతిలోని ఇద్దరు బాలికలు ఉండనున్నారు. ఎక్స్‌టర్నల్‌ సభ్యులుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌, షీ టీం ఇన్‌చార్జి ఉంటారు. జిల్లా స్థాయి కమిటీకి పాలనాధికారి అధ్యక్షుడిగా ఉంటారు. ఇందులో సభ్యులుగా జిల్లా విద్యాధికారి, ఐసీడీఎస్‌ అధికారితో పాటు జిల్లా బాలికల అభివృద్ధి అధికారి వ్యవహరించనున్నారు. నెలకోసా రి సమావేశమై ఆయా విషయాలపై కలెక్టర్‌ చర్చించాల్సి ఉంటుంది. సం ఘాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. మొత్తంగా బాలికల్లో మనోధై ర్యం పెంచుకోవడం, సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ఈ కమిటీలు దోహదపడనున్నాయి.

అవసరం మేరకు పోలీసుల సహకారం..

పాఠశాలల్లో చదివే బాలికల్లో ఆత్మవిశ్వాసం కల్పించేందుకు పోలీసుల తో కలిపి పనిచేసేలా అవగాహన కల్పిస్తారు. లైంగిక వేధింపులు, దూష ణలు, బెదిరింపులు, ఈవ్‌టీజింగ్‌, అనుచిత ప్రవర్తన తదితర ఘటనలు జరిగినప్పుడు బాలికలు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేసి రక్షణ పొందేలా చైతన్యపరుస్తారు. ఈ విషయంలో పాఠశాలల కమిటీలు స్థాని క పోలీసులకు వారధిగా పనిచేయాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నారు.

బాలికల రక్షణకు చర్యలు

జగన్‌ మోహన్‌ రెడ్డి, జిల్లా విద్యాధికారి

బాలికల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో బాలికల సాధికారత సంఘాలను ఏర్పాటు చేస్తాం. దీని వల్ల విద్యార్థినులు స్వేచ్చాయుత వాతావరణలో చదువుకునే అవకాశం ఉంటుంది. ఏదేని సమస్య తలెత్తి ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటాం.

Updated Date - Dec 17 , 2023 | 12:33 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising