ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వేములవాడలో ఆది శ్రీనివాస్‌

ABN, First Publish Date - 2023-12-04T01:49:20+05:30

వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో తొలి రౌండ్‌ నుంచే హస్తం హవా కొనసాగింది.

కౌంటింగ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌మహాజన్‌

వేములవాడ, డిసెంబరు 3: వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో తొలి రౌండ్‌ నుంచే హస్తం హవా కొనసాగింది. రౌండ్ల వారీగా చూస్తే కారు గుర్తుకు ఆరో రౌండ్‌లో 65 ఓట్లు 12వ రౌండ్‌లో 33 ఓట్లు, 13వ రౌండులో 58 ఓట్లు ఆధిక్యం కనిపించగా, చల్మెడ లక్ష్మీనరసింహారావు స్వగ్రామమై న మల్కపేట ఉన్న చివరిదైన 19వ రౌండ్‌లో మా త్రమే 286 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం 2,22,251 ఓట్లకు గాను 1,74,145 ఓట్లు పోల్‌ కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ తొలి రౌండ్‌లో 3112 ఓట్లు సాధించగా, చల్మెడకు 2908 ఓట్లు మాత్రమే రావడంతో కాంగ్రెస్‌కు మెజారిటీ 204 ఓట్ల ఆధిక్యత లభించింది. రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3033, బిఆర్‌ఎస్‌కు 2743 ఓట్లు లభించగా మెజారిటీ 494కు చేరింది. మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3105, బీఆర్‌ఎస్‌కు 2606 ఓట్లు రావడంతో ఆధిక్యత 993కి పెరిగింది. నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3805, బీఆర్‌ఎస్‌ 2861 ఓట్లు రావడంతో మెజారిటీ 2437కు చేరింది. ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3431, బీఆర్‌ఎస్‌కు 3027 ఓట్లు రావడంతో ఆధిక్యత 2841కి పెరిగింది. ఆరో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3260, బిఆర్‌ఎస్‌కు 3325 ఓట్లు రావడంతో ఆధిక్యత 2776కు తగ్గింది. ఏడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4960, బీఆర్‌ఎస్‌కు 3113 ఓట్లు రావడంతో ఒక్కసారిగా మెజారిటీ 4623కు చేరింది. ఎనిమిదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4142, బీఆర్‌ఎస్‌కు 2718 ఓట్లు రావడంతో మెజారిటీ 6047కు పెరిగింది. తొమ్మిదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4232 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 3362 ఓట్లు లభించడంతో ఆధిక్యత 6917కు చేరింది. 10వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3562, బీఆర్‌ఎస్‌కు 2373 ఓట్లు రావడంతో మెజారిటీ 8106కు పెరిగింది. 11వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4127, బీఆర్‌ఎస్‌కు 3188 ఓట్లు రావడంతో కాంగ్రెస్‌కు 9045 మెజారిటీకి చేరింది. 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4054, బీఆర్‌ఎస్‌కు 4087 రాగా, మెజారిటీ 9012కు తగ్గింది. 13వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4029 ఓట్లు రాగా, బీఆర్‌ ఎస్‌కు 4087 ఓట్లు రావడంతో మెజారిటీ 8954కు పడిపోయింది. ఈ క్రమంలో 14వ రౌండ్‌లో కాంగ్రెస్‌ కు 3795 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 3271 ఓట్లు రావడంతో మెజారిటీ 9478కి పెరిగింది. 15వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4775, బీఆర్‌ఎస్‌కు 2879 ఓట్లు రావడంతో మెజారిటీ పదివేల మార్కు దాటి 11,374 ఓట్లుకు పెరిగింది. 16వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3300, బీఆర్‌ఎస్‌కు 2331 ఓట్లు రాగా, మెజారిటీ 12,343కు చేరింది. 17వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4259, బీఆర్‌ఎస్‌కు 2876 ఓట్లురావడంతో కాంగ్రెస్‌ ఆధిక్యత 13,726 ఓట్ల కు పెరిగింది. 18వ రౌండ్‌లో కాం గ్రెస్‌కు 3967 ఓట్లు, బీఆఆర్‌ ఎస్‌కు 3109 ఓట్లు రాగా, ఆధిక్యత 14,584కు చేరింది. 19వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 1888 ఓట్లు మాత్ర మే రాగా బీఆర్‌ఎస్‌కు 2174 ఓట్లు రావడంతో కాం గ్రెస్‌ ఆధిక్యత 14,288 ఓట్లకు తగ్గింది. పోస్టల్‌ బ్యాలె ట్లలో కాంగ్రెస్‌కు 615 ఓట్లు, బీఆఆర్‌ఎస్‌ 332 ఓట్లు రావడంతో కాంగ్రెస్‌ మొత్తం మెజారిటీ 14,581కి చేర డంతో ఆది శ్రీనివాస్‌ ఘన విజయం సాధించారు.

ఫ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం

వేములవాడ శాసనసభ్యుడుగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్‌ శ్రేణులలో నూతనోత్సాహం నెలకొంది. ఉదయం నుంచి ప్రతి రౌండ్‌లోనూ ఆది శ్రీనివాస్‌ స్పష్టమైన ఆధిక్యం కనబర్చడంతో సగం రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికే ఆది శ్రీనివాస్‌ విజయం ఖాయమని తేలిపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. 2009లో నూతనంగా ఏర్ప డిన వేములవాడ నియోజకవర్గంలో తొలిసారిగా కాం గ్రెస్‌ జెండా ఎరగడంతో కాంగ్రెస్‌ నాయకులు ఆనం దంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ట్లు ధ్రువీకరణపత్రం అందుకున్న అనంతరం వేముల వాడకు వస్తున్న ఆది శ్రీనివాస్‌కు నందికమాన్‌ నుంచి కాంగ్రెస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు.

Updated Date - 2023-12-04T01:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising