ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాధ్యతలు స్వీకరించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:23 AM

జిల్లా స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పూజారి గౌతమి శనివారం కలెక్టరేట్‌లో బాధ్యతలను స్వీకరించి విధుల్లో చేరారు. అంతకుముందు కలెక్టర్‌ అనురాగ్‌జయంతిని మర్యాదపూర్వకంగా కలిసి తన జాయినింగ్‌ రిపోర్ట్‌ను అందజేశారు.

ప్రసాదం అందజేస్తున్న ఆలయ అధికారి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 16 : జిల్లా స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పూజారి గౌతమి శనివారం కలెక్టరేట్‌లో బాధ్యతలను స్వీకరించి విధుల్లో చేరారు. అంతకుముందు కలెక్టర్‌ అనురాగ్‌జయంతిని మర్యాదపూర్వకంగా కలిసి తన జాయినింగ్‌ రిపోర్ట్‌ను అందజేశారు. అనంతరం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి గౌతమికి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. 2021 బ్యాచ్‌కు చెందిన గౌతమి తన మొదటి పరీక్షలోనే 317 ర్యాంక్‌తో ఐఏఎస్‌ సాధించారు. మంచిర్యాల జిల్లాలో శిక్షణ పూర్తిచేసుకున్నారు. స్థానిక సంస్థల ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్న జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌతంరెడ్డి నుంచి పూజారి గౌతమి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆర్డీవో అనంద్‌కుమార్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బొద్దుల గంగయ్య, డీఆర్‌డీవో నక్క శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, మీర్జా ఫాసత్‌ అలీబేగ్‌, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, మైనింగ్‌ జిల్లా అధికారి సైదులు, డీపీఆర్వో మామిండ్ల దశరథం మర్యాదపూర్వకంగా కలిశారు.

వేములవాడ : వేములవాడ రాజరాజేశ్వర స్వామిని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పూజారి గౌతమి దర్శించుకున్నారు. శనివారం అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె వేములవాడ చేరుకుని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌ స్వామివారి ప్రసాదం అందజేశారు. ప్రొటోకాల్‌ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, తహసీల్దార్‌ మహేష్‌ ఉన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:23 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising