మహిళా సాధికారతకు సంకేతం
ABN, First Publish Date - 2023-12-11T00:16:28+05:30
మహాలక్ష్మి పథకం పేరిట కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహిళలకు చార్జీల్లేని ప్రయాణం మహిళా సాధికారతకు సంకేతమని వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, డిసెంబరు 10 : మహాలక్ష్మి పథకం పేరిట కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహిళలకు చార్జీల్లేని ప్రయాణం మహిళా సాధికారతకు సంకేతమని వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉచిత బస్సు ప్రయాణం, ఏరియా ఆస్పత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పోస్టర్ ఆవిష్కరించి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తోంద న్నారు. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ఉచిత ప్రయాణాన్ని అమలు చేసిందని, త్వరలోనే రూ.500 వంట గ్యాస్ సిలిండర్ హామీపై సమీక్షించి నిర్ణయం తీసు కుంటుందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యోశ్రీ పథకం ద్వారా పేదలకు రూ. 10 లక్షల వైద్య సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో రూ.5 లక్షల వరకు ఆరోగ్యబీమా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచిందన్నారు. ఈ పథకంతో 1672 రకాల వ్యాధులకు వైద్యం అందించే దిశగా ప్రభుత్వం రూ.10లక్షలకు పెంచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు మెరుగైన వైద్యం అందిం చాలనే ఈ పథకాన్ని అమలు చేసినట్లు చెప్పారు. ఈ కార్య క్రమంలో జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, ఆ ర్డీవో మదుసూదన్, చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, కౌన్సిలర్ బింగి మహేష్ నాయకులు రంగు వెంకటేష్, చింతపల్లి శ్రీనివాస్‌రావు, సంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T00:16:31+05:30 IST