ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పారదర్శకంగా విచారణ చేపట్టాలి: ఎస్పీ

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:15 PM

జిల్లాలోని వివిధ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ పకడ్బందీగా విచారణ చేపట్టాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

నారాయణపేట, డిసెంబరు 22: జిల్లాలోని వివిధ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ పకడ్బందీగా విచారణ చేపట్టాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. నెలవారి సమీక్షలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ పీఎస్‌ల వారిగా పెండింగ్‌ కేసులపై వివరాలు ఆరా తీశారు. పెండింగ్‌ కేసులను విచారణ చేపట్టి న్యాయధికారులతో సమన్వయం చేసుకుంటూ పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు పూర్తైనందున కేసుల విచారణపై ప్రత్యేక దృష్టిని సారించి విచారణ చేపట్టాలని, పీఎస్‌ల వారిగా గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసు వివరాలు, యూఐ కేసుల వివరాలను పరిశీలించారు. ఎస్టీ, ఎస్సీ కేసుల వివరాలు, ఫోక్సో కేసుల వివరాలను పరిశీలించి ఆయా కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. కోర్టు ట్రయల్స్‌ నడిచే సమయంలో సాక్షులను ప్రవేశ పెట్టి కేసులకు సంబంధించి విషయాలను బాధితులకు అప్‌డేట్‌ చేస్తూ నింది తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చోరీ కేసులను ఛేదించడంలో ప్రత్యేక దృష్టిని సారించాలని, ప్రణాళిక రూపొందిం చుకోవాలని, అందుకు సీసీ కెమెరాలను పరిశీలించాలని, సీసీ కెమెరాలు పని చేయకుంటే వాటిని రిపేర్లు చేయించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని, ఈనెలలో నిర్వహించే లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ పడేందుకు అవకాశమున్న కేసులను గుర్తించి బాధితులకు అవగాహన కల్పించాలని ఎస్పీ అధికారుల ను ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీలు సత్య నారాయణ, వెంకటేశ్వర రావు, సీఐలు రాంలాల్‌, రాజేందర్‌, జనార్దన్‌, ఎస్‌ఐ లు విజయ్‌, హరిప్రసాద్‌, పర్వతాలు, శ్రీనివాసులు, విజయ్‌, మల్లేష్‌, కుర్మ య్య, ఐటీ సెల్‌ ఎస్‌ఐ సునీత తదితరుల పాల్గొన్నారు.

జిల్లా పోలీస్‌ యూనిట్‌ లోగో ఆవిష్కరణ

జిల్లా పోలీస్‌ యూనిట్‌ లోగోను ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ లోగోలో ఉన్న సురక్ష అహర్నిశం అంటే రాత్రి, పగలు శాంతి భద్రతలను కాపాడుతూ అన్న సందేశాన్ని ఇస్తుందన్నారు. ఆలివ్‌ కొమ్మ శాంతికి చి హ్నం అన్నారు. 12 స్టార్‌లు 12 పోలీస్‌స్టేషన్లుగా అభివర్ణించారు. కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో మొ దటగా కృష్ణా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తంగిడి గ్రా మం వద్ద ప్రవేశిస్తునం దున కృష్ణ బ్రిడ్జి, కృష్ణానదిని సూచిస్తూ లోగోను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్ర మంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీలు సత్య నారాయణ, వెంకటేశ్వర రావు, సీఐలు రాంలాల్‌, రాజేందర్‌, జనార్దన్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising