జహీరాబాద్‌లో అమానవీయం..!!
ABN, First Publish Date - 2023-12-11T03:59:57+05:30
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేయగా..
చెత్తకుప్పలో పసికందు.. పీక్కుతిన్న కుక్కలు, పందులు
జహీరాబాద్, డిసెంబరు 10: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేయగా.. కుక్కలు, పందులు ఆ పసికందును పీక్కుతున్నాయి. దీంతో ఆ పసికందు మృతదేహం సగభాగం మాత్రమే మిగిలింది. జహీరాబాద్‌లోని అహ్మద్‌నగర్‌లో జరిగిన ఈ దారుణాన్ని స్థానికులు ఆదివారం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-12-11T03:59:59+05:30 IST